EO INSPECTS NG SHEDS _ నారాయణగిరి ఉద్యానవనాల్లో క్యూ లైన్లను పరిశీలించిన టీటీడీ ఈవో

SHOW CAUSE NOTICE ISSUED TO THE CONCERNED SANITATION OFFICIAL FOR IMPROPER SANITATION

TIRUMALA, 20 JUNE 2024: TTD EO Sri J Syamala Rao on Thursday inspected Narayanagiri Sheds to see the amenities.

As a part of it he visited Sarva Darshan, Slotted Sarva Darshan and Special Entry Darshan queue lines leading to the Vaikuntham Queue Complex.

He made some valuable suggestions to the Engineering and Vigilance officials ensuring hassle-free darshan to pilgrims.

Expressing his serious concern over the untidy premises, dumping of chappals and improper sanitation measures at Narayanagiri Sheds 

he instructed to issue Showcause notice to the officer concerned.

JEOs Smt Goutami, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswara Rao, SE2 Sri Jagadeeshwar Reddy and officials were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నారాయణగిరి ఉద్యానవనాల్లో క్యూ లైన్లను పరిశీలించిన టీటీడీ ఈవో

•⁠ ⁠పారిశుద్ధ్యం సరిగా లేనందుకు సంబంధిత అధికారికి షోకాజ్ నోటీసు జారీ

తిరుపతి, 2024 జూన్ 20: టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అధికారులతో కలిసి గురువారం నారాయణగిరి షెడ్ల వద్ద వివిధ క్యూ లైన్లను పరిశీలించారు.

ఇందులో భాగంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు వెళ్లే సర్వ దర్శనం, స్లాటెడ్ సర్వ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేందుకు ఇంజినీరింగ్, విజిలెన్స్ అధికారులకు పలు సూచనలు చేశారు.

నారాయణగిరి షెడ్లలోని క్యూలైన్ల పరిశీలనలో భాగంగా సరైన పారిశుద్ధ్య చర్యలు లేకపోవడంతో సంబంధిత అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు.

ఈవో వెంట జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్‌వో శ్రీ నరసింహ కిషోర్, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఈ2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.