EO INSPECTS QUEUE LINES _ తిరుమలలో క్యూ లైన్లను తనిఖీ చేసిన టీటీడీ ఈవో
INTERACTS WITH PILGRIMS
TIRUMALA, 16 JUNE 2024: TTD EO Sri J Syamala Rao inspected outside queue lines and Narayanagiri Sheds on Sunday evening and interacted with the devotees.
Speaking to media on the occasion he said, in his maiden inspection, he had personally monitored the arrangements of food and water to the scores of pilgrims and received feedback from the devotees.
He said, at some places the devotees received food and water while they have informed that they have not received milk in some areas. “To fill these gaps, I have instructed the officials concerned immediately to make the required arrangements for the multitude of devotees waiting in queue lines and sheds”, he maintained.
JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CEO Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, DyCF Sri Srinivasulu, CPRO Dr T Ravi and others were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో క్యూ లైన్లను తనిఖీ చేసిన టీటీడీ ఈవో
తిరుమల, 2024 జూన్ 16: టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆదివారం సాయంత్రం తిరుమలలోని క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను పరిశీలించి భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, తన తొలి తనిఖీలో భక్తులకు టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదాలు, తాగునీరు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి భక్తుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నట్లు చెప్పారు.
కొన్ని చోట్ల భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందుతుండగా, కొన్ని ప్రాంతాల్లో పాలు అందడం లేదని చెప్పినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు, షెడ్లలో వేచి ఉన్న వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
ఈవో వెంట జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్‌వో శ్రీ నరసింహ కిషోర్, సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డీవైసీఎఫ్ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు ఉన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.