EO INSPECTS TIRUMALA DEVELOPMENT WORKS IN FIRST GHAT ROAD _ తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో టిటిడి ఈవో తనిఖీలు

TIRUMALA, 05 NOVEMBER 2021: TTD EO Dr KS Jawahar Reddy along with CVSO Sri Gopinath Jatti inspected the development works along the first ghat road on Friday.

 

The EO directed the Engineering Officials to complete the levelling works on both sides of the Alipiri footpath. He also directed the Health wing to ensure that there be no sale of plastic bottles by the footpath vendors. He inspected the development of greenery at 7th Mile and also in the 29th turning and directed the forest officials to take up more greenery to enhance the aesthetic feel for the visiting pilgrims.

 

CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, Health Officer Dr Sridevi, EE Sri Surendra Reddy, DE Sri Ravishankar Reddy, VGO Sri Bali Reddy, FRO Sri Venkatasubbaiah and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో టిటిడి ఈవో తనిఖీలు

తిరుమల, 2021 నవంబరు 05: టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి శుక్రవారం ఉద‌యం అధికారుల‌తో క‌లిసి తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు.

ఇందులో భాగంగా జిఎన్ సి టోల్ గేట్ , అలిపిరి నడక మార్గంలోని ఏడవ మైలు, 29వ మలుపు వద్ద పనులను ప‌రిశీలించారు. అలిపిరి నడక మార్గంలో బాత్ రూమ్ లను పరిశీలించి, మరింత పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని టీటీడీ ఆరోగ్య విభాగం అధికారిని ఆదేశించారు. తిరుమల, అలిపిరి నడక మార్గం ప‌విత్ర‌త‌ను, స్వ‌చ్ఛ‌త‌ను కాపాడేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామ‌ని, దుకాణాదారులు ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్లను విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా టిటిడి అటవీ విభాగం ఆధ్వర్యంలో మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. గతంలో కన్నా పచ్చదనం పెంపొందిందని, భక్తులకు మరింత ఆహ్లాదకరంగా
ఉండేవిధంగా వివిధ రకాల పుష్పాల మొక్కలు పెంచాలని సూచించారు. అలిపిరి కాలిబాటకు ఇరువైపులా గుంతలు, మిట్టలుగా ఉన్న మట్టిని చదును (లెవల్) చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీల్లో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్‌ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీ‌దేవి, ఇఇ శ్రీ సురేందర్ రెడ్డి, డిఈ శ్రీ రవి శంకర్ రెడ్డి, విజివో శ్రీ బాలి రెడ్డి, ఎఫ్ ఆర్ వో శ్రీ వెంకట సుబ్బయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.