SPEED UP REFUNDS IN ONLINE- EO SINGHAL_ ఆన్‌లైన్‌లో రీఫండ్ త్వరగా చెల్లించేలా చర్యలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
Tirupati, 18 July 2019: TTD Executive Officer Sri Anil Kumar Singhal has directed the TTD IT department officials to speed up online refunds for cancellations of Srivari Arjita Seva tickets rooms and Kalyana Mandapam bookings by devotees.
During the review meeting on the IT department held at his chambers in TTD administrative building on Thursday morning, the EO said all complaints about refunds should also be linked with the TTD call centres for a quicker solution.
He advised the IT personnel to design a special App, which would indicate devotees using rooms and lockers for more than two days at the click of a button. The Next Gen application utilized in the Srivari Seva should be made more user-friendly to indicate the number of Sevakulu deployed during busy and lean days, he directed the concerned.
He also wanted the engineering and other departments to henceforth raise bills in a paperless environment. Later he suggested the officials for the compilation of privileges and benefits to devotees who contributed to the SRIVANI Trust (temple construction trust). He also urged officials to take steps to ensure 100 per cent occupancy at all TTD guest houses and choultries.
TTD Special Officer Sri AV Dharma Reddy, Tirupati JEO Sri P Basant Kumar, Chief Engineer Sri Chandrasekhar Reddy, Head of IT department Sri Sesha Reddy also participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆన్‌లైన్‌లో రీఫండ్ త్వరగా చెల్లించేలా చర్యలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
జూలై 18, తిరుపతి, 2019: శ్రీవారి ఆర్జితసేవలు, గదులు, కల్యాణమండపాలు తదితరాలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులు వాటిని రద్దు చేసుకున్న పక్షంలో త్వరితగతిన రీఫండ్ చెల్లించేలా అప్లికేషన్‌లో మార్పులు చేపట్టాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఐటి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో గురువారం ఐటి విభాగంపై ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రీఫండ్‌కు సంబంధించిన ఫిర్యాదులను కాల్‌సెంటర్‌కు కూడా అనుసంధానం చేయాలని, తద్వారా సంబంధిత భక్తులకు సరైన సమాచారం ఇవ్వడంతోపాటు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలవుతుందని అన్నారు. తిరుమలలో వసతి గదులు, లాకర్లను మరింత పారదర్శకంగా కేటాయించడంతోపాటు, లాకర్లు పొందే తేదీ, తిరిగి అప్పగించే తేదీల నమోదు, 2 రోజులకు మించి లాకర్లు వినియోగించేవారి సమాచారం తెలుసుకునేందుకు వీలుగా కంప్యూటర్ అప్లికేషన్ రూపొందించాలన్నారు. శ్రీవారి సేవకు సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ అప్లికేషన్‌లో రద్దీ ఉన్న రోజులు, లేని రోజుల్లో అవసరమైన సేవకుల సంఖ్యను ఆయా విభాగాలు ఎప్పటికప్పుడు తెలియజేయడం, అందుకు అనుగుణంగా సేవకుల కేటాయింపునకు వీలుగా మార్పులు చేపట్టాలన్నారు.
శ్రీవాణి ట్రస్టు(ఆలయ నిర్మాణం) కు సంబంధించి దాతలకు కల్పించే ప్రయోజనాలపై విధి విధానాలు రూపొందించాలని ఈవో సూచించారు. తిరుమలలో గదుల బుకింగ్‌కు సంబంధించి 100 శాతం ఆక్యుపెన్సీ నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో కాగిత రహిత బిల్లులు రూపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్డి, తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.