ELECTRICAL ILLUMINATION SHOULD GALORE IN TPT DURING TML BTUs-EO_ శ్రీవారి బ్రహోత్మత్సవాల శోభ తిరుపతిలో కనిపించేలా  అలంకరణలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ 

Tirupati, 6 August 2018: The temple votu of Tirupati should be decked with electrical illuminations and displays, directed TTD EO Sri Anil Kumar Singhal.

During the review meeting held with senior officers in the conference hall in TTD administrative building in Tirupati on Monday, the EO said, the temple city should be decorated with electrical displays with mythological themes.

He instructed the concerned to complete the printing of pamphlets and posters of annual brahmotsavams by August 20.

Later he instructed the engineering wing to complete the new seva sadan building works, Kanya kumari and Kurukshetra temple works on time.

JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, FACAO Sri Balaji, DLO Sri Ramana Naidu were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారి బ్రహోత్మత్సవాల శోభ తిరుపతిలో కనిపించేలా అలంకరణలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ 

తిరుపతి, 2018 ఆగష్ఠు 6: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాల శోభ తిరుపతిలో కనిపించేలా అలంకరణలు, కటౌట్లు, వివిధ దేవతామూర్తులతో కూడిన తోరణాలు, ఆకర్షిణీయంగా విద్యుత్‌ దీపాల వెలుగులు కనిపించేలా ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని సమావేశమందిరంలో సోమవారం ఆయన సీనియర్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఈ నెల 20 తేది నాటికి సిద్ధం చేయాలన్నారు. తిరుమలలో అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ సందర్భంగా యాగశాల వద్ద ఏర్పాటు చేస్తున్న ఇంజనీరింగ్‌ పనులు సౌకర్యవంతంగా ఉండాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాలలో తిరుమల, తిరుపతిలలో భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్‌ ఏర్పాట్లు, పార్కింగ్‌ ప్రదేశాలలో తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. టిటిడిలో ఐటి ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మరింత పటిష్టం చేయాలన్నారు. తిరుమలలో శ్రీవారి సేవకుల సౌకర్యార్థం నిర్మిస్తున్న శ్రీవారి సేవా సదన్‌ భవనాన్ని బ్రహ్మోత్సవాల ప్రారంభం నాటికి పూర్తి చేయాలని సిఈ శ్రీ చంద్రశేఖర్‌ రెడ్డిని ఆదేశించారు. తిరుమలలోని వివిధ భవనాలకు సంబంధించి అగ్నిప్రమాద నివారణ చర్యలు తీసుకునేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు రూపొందించాలన్నారు.

శ్రీవారి ధర్మ రథాల బస్సులలోనికి ప్రవేశించేందుకు, దిగేందుకు ఉన్న మెట్లను భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. కన్యాకుమారి, హైదరాబాదులలో నిర్మిస్తున్న టిటిడి  ఆలయాల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.     

టిటిడి ఇంజనీరింగ్‌ విభాగంలో ఉన్న వివిధ భవనాల నిర్వహణపై ఆయా విభాగాల అధికారులు పరిశీలించి అవసరమైన అంచనాలను తయారు చేయాలన్నారు. అదేవిధంగా అలిపిరి, గాలిగోపురం మధ్య మొక్కల పెంపకానికి నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన డ్రిప్‌ ఇరిగేషన్‌ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  

ఈ కార్యక్రమంలో తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఎఫ్‌ఎ అండ్‌ సిఎవో శ్రీ బాలాజీ, డిఎల్‌వో శ్రీ ఎం.వి.రమణ నాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.