EO PRESENTS VASTRAMS TO TIRUTTANI TEMPLE _ తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి టీటీడీ సారె
TIRUMALA, 29 JULY 2024: On the auspicious occasion of Adi Kriittika, TTD EO Sri J Syamala Rao presented pattu vastrams on behalf of Tirumala Sri Venkateswara Swamy to Sri Subramanya Swami in Tiruttani temple on Monday.
Later speaking to the media here he said, since 2006, TTD has been offering silks to the presiding deity of Sri Subramanya Swamy who is also popularly known as ”Tanikesan” in this renowned hill shrine.
”Devotees perform Kavadi Puja with great devotion on this occasion. And I prayed the presiding deity to bestow His benign blessings on the wellbeing of the entire humanity”, he maintained.
Earlier on his arrival to the temple, he was welcomed by the Temple JC Sri Arunachalam, Temple Chairman Sri Sridhar, members and others.
Tirumala Temple DyEO Sri Lokanatham, Parupattedar Sri Tulasiprasad, Veda Paraynamdars were also present.
తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి టీటీడీ సారె
తిరుమల, 2024 జూలై 29: తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు సోమవారం సమర్పించారు. టీటీడీ ఆధికారులకు తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ఆలయ ఛైర్మన్ శ్రీ శ్రీధర్, జాయింట్ కమిషనర్ శ్రీ అరుణాచలం, తిరుత్తణి ఆలయ బోర్డు సభ్యులు, ఇతర ఆధికారులు ఘనస్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రసిద్ది గాంచిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తణి అత్యంత ప్రముఖమైనదని తెలిపారు. టీటీడీ 2006 నుండి ఆడికృతికను పురస్కరించుకుని శ్రీ సుబ్రమణ్యస్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆచారంగా వస్తున్నదని చెప్పారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పారుపత్తేదార్ శ్రీ తులసి ప్రసాద్, వేద పరాయణదారులు ఉన్నారు.
చారిత్రక ప్రాశస్త్యం :
తిరుపతి పుణ్యక్షేత్రం నుండి సుమారు 50 కి.మీ. దూరంలో తమిళనాడు రాష్ట్రంలో వెలసివున్న ఈ దివ్యక్షేత్రం తమిళులు అత్యంత భక్తి పూర్వకంగా స్తుతించే ”ఆరుపడైవీడు” లో ఒక్కటి. సురపద్ముడనే అసురుని సంహరించి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ తన ఉభయదేవేరులైన శ్రీవళ్ళీ, దేవయాని అమ్మవార్ల సమేతంగా తనికేశన్‌గా వెలసి భక్తులచే పూజలు అందుకొంటున్నారు.
ఈ క్షేత్ర ప్రాశస్త్యంలో మరొక ముఖ్యమైన చారిత్రక నేపధ్యానికి వస్తే ఇక్కడ వెలసి వున్న పుష్కరిణిలో (నంది నది) సర్పరాజు వాసుకి స్నానం ఆచరించి సముద్ర మధనం సమయంలో మందర పర్వతానికి తనను తాడుగా ఉపయోగించి దేవాసురులు అమృతం కోసం చిలుకుతున్నప్పుడు ఏర్పడిన గాయాల నుండి ఉపశమనం పొందాడు. ఈ ఆలయంలో నిర్వహించే అనేక ఉత్సవాలలో ఆడికృత్తిక అత్యంత ప్రముఖమైనది. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో పూలతో అలంకరించిన కావడులను ఎత్తుకు వెళ్ళి మొక్కుబడలు చెల్లించడం విశేషం.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.