EO REVIEWS ON GO MAHA SAMMELAN ARRANGEMENTS _ గో మహాసమ్మేళనం ఏర్పాట్లపై ఈవో సమీక్ష

Tirupati, 25 October 2021: TTD Executive Officer Dr. KS Jawahar Reddy conducted a review on the ongoing preparations for the landmark two-day Go Maha Sammelan by TTD as a part of the promotion of Go worship and Go-based organic farming at the Mahati auditorium on 0ctober 30 and 31.

Addressing the review meeting at his chambers in the TTD administrative building on Monday afternoon, the EO issued several directions and also made valuable suggestions to the officials concerned.

He instructed them to prepare the list of Pontiffs, heads of mutts, and farmers coming from all regions and asked the TTD JEO Sri Veerabrahmam to personally interact with all bigwigs participating in the two conferences.

He said while the Pontiffs and Mutt chiefs should be accommodated at the  Tirumala Mutts, the farmers and other representatives should be housed at  Srinivasam, 2nd & 3rd Choultries at Tirupati, and also at Sri Padmavati Nilayam in Tiruchanoor.

The TTD JEO informed that nearly 27 mutt heads and Pontiffs had confirmed their participation. About 25 committees including Conference conducting, Lodging, Boarding, Reception, Stage, Media, Publicity, Food, Hospitality, Transport, Infrastructure, Exhibition, Security and Sanitation have been constituted, he added.

The EO insisted that full-fledged sanitizers and masks be organized at the entrance and Dias of the auditorium and all committees should work with full coordination on their functions and responsibilities as per schedule from Tuesday onwards.

Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Chief engineer Sri Nageswara Rao and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గో మహాసమ్మేళనం ఏర్పాట్లపై ఈవో సమీక్ష

తిరుపతి  25 అక్టోబరు 2021 ;తిరుపతి మహతి కళాక్షేత్రంలో అక్టోబరు 30 మరియు 31 వ తేదీల్లో నిర్వహించనున్న గో మహా సమ్మేళనం ఏర్పాట్లపై టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సోమవారం సమీక్ష జరిపారు.

టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్లో ఆయన సమ్మేళనం ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఏ ప్రాంతం నుంచి ఎంతమంది స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, రైతులు వస్తున్నారనే వివరాలు సిద్ధం చేయాలన్నారు. సమ్మేళనానికి హాజరవుతున్న ముఖ్యులతో స్వయంగా మాట్లాడాలని జెఈవో శ్రీ వీరబ్రహ్మం కు ఆయన సూచించారు. స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధితులకు తిరుమలలోని మఠాలు, వివిధ ప్రాంతంలోనూ, రైతులు, ఇతర ప్రతినిధులకు తిరుపతిలోని శ్రీనివాసం,శ్రీ పద్మావతి నిలయంతో పాటు రెండు మరియు మూడవ సత్రాల్లో వసతి ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గో మహా సమ్మేళనానికి ఇప్పటివరకు 27 మంది స్వాములు వస్తున్నట్టు సమాచారం ఇచ్చారని జేఈవో తెలిపారు. వేదిక వద్ద, మహతి లోని ప్రవేశ మార్గాల వద్ద పూర్తిస్థాయిలో శానిటైజర్ లు మాస్కులు ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు. సమ్మేళనం నిర్వహణ కోసం కోఆర్డినేషన్, వసతి, రిసెప్షన్, స్టేజి, మీడియా మరియు పబ్లిసిటీ, ఫుడ్, హాస్పిటాలిటీ, రవాణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎగ్జిబిషన్, డయాస్, సెక్యూరిటీ, హెల్త్ అండ్ శానిటేషన్ లాంటి 25 కమిటీలను నియమించామని శ్రీ వీరబ్రహ్మం వివరించారు.

ఈ కమిటీల భాద్యతలు, విధులపై మంగళవారం సాయంత్రం లోగా స్పష్టత రావాలని ఈవో ఆదేశించారు. అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, సివిఎస్ఓశ్రీ గోపీనాథ్ జెట్టి, గోశాల డైరెక్టర్శ్రీ హరినాథ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వర రావు తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది