EO REVIEWS ON MONSOON PREPAREDNESS _ రుతుపవనాల సన్నధ్ధత పై టీటీడీ ఈవో సమీక్ష

Tirumala, 20 JUNE 2024: TTD EO Sri J Syamala Rao on thursday evening reviewed on the Monsoon Preparedness by the Engineering department.

The review meeting took place at Gokulam Rest House in Tirumala.

The officials explained how the second ghat road has been restored when it was affected with the falling of boulders due to heavy rains in the years 1996, 2004, 2005, 2015 and recently in 2021 through power point presentation.

Later they also explained him about the five dams in Tirumala which are the main sources of water to the pilgrims besides Kalyani Dam in Tirumala.

The EO instructed the Engineering officials to have a Disaster Management Plan to counter such incidents if any with preparedness in future.

Later the EO also reviewed the procurement and warehousing departments.

In the review meetings JEOs Smt Goutami, Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, SE2 Jagadeeshwar Reddy, EEs Sri Surendranath Reddy, Sri Srihari, DE Electrical Sri Ravishankar Reddy, GM Procurement Sri Murali Krishna, DyEO Warehouse Smt Padmavati and others were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రుతుపవనాల సన్నధ్ధత పై టీటీడీ ఈవో సమీక్ష

తిరుమల, 2024 జూన్‌ 20: టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు గురువారం సాయంత్రం రాబోవు వర్షాకాల సన్నద్ధతపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు.

తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో ఈ సమీక్ష జరిగింది.

ఇందులో భాగంగా 1996, 2004, 2005, 2015, ఇటీవల 2021 సంవత్సరాల్లో కురిసిన భారీ వర్షాలకు బండరాళ్లు కూలి దెబ్బతిన్న రెండో ఘాట్‌ రోడ్డును ఎలా పునరుద్ధరించారో అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఈవోకు వివరించారు.

అనంతరం తిరుపతిలోని కళ్యాణి డ్యాంతో పాటు, తిరుమలలో భక్తులకు ప్రధాన నీటి వనరులైన ఐదు డ్యాముల గురించి కూడా ఆయనకు వివరించారు.

భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులను ఈఓ ఆదేశించారు.

అనంతరం కొనుగోళ్లు, గిడ్డంగుల శాఖలపై కూడా ఈఓ సమీక్షించారు.

సమీక్షా సమావేశాల్లో జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఈ2 జగదీశ్వర్‌రెడ్డి, ఈఈలు శ్రీ సురేంద్రనాథ్‌రెడ్డి, శ్రీశ్రీహరి, డీఈ ఎలక్ట్రికల్‌ శ్రీ రవిశంకర్‌రెడ్డి, జిఎం (కొనుగోలు) శ్రీ మురళీకృష్ణ, వేర్హౌజ్ డిప్యూటీ ఈవో శ్రీమతి పద్మావతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.