EO REVIEWS TTD HOSPITALS AND EDU. INSTITUTIONS _ టీటీడీ ఆసుపత్రులు మరియు విద్యాసంస్థల కార్యకలాపాలపై సమీక్షించిన -ఈవో శ్రీ జె.శ్యామలరావు –

TIRUPATI, 12 JULY 2024: TTD EO Sri J Syamala Rao on Friday evening reviewed on TTD-run Hospitals and Educational Institutions.

Along with JEO for Health and Education Smt Goutami, he reviewed in detail with the heads of respective Hospitals and Educational Institutions.

As a part of it SVIMS Director Dr RV Kumar explained the EO the various areas and facilities in their super speciality Hospital, while Sri Padmavati Children’s Heart Care Centre Director Dr Srinath Reddy explained the EO that so far 2901 heart surgeries have been successfully carried out on children that includes 1544 open heart and 1357 key hole surgeries.

Through PPT he also explained the EO, besides 16 Heart Transplantations which were carried out in the last three years free of cost in the hospital.

He said besides AP, patients from Telangana, Tamilnadu, Karnataka, West Bengal, Orissa, Bihar and even from Andaman, Bangladesh also.

Among others, Dr Ram, Dr Jayachandra Reddy from SVIMS, Dr Venugopal, RMO Sri Kishore from BIRRD, TTD CMO Dr. Muralidhar, Incharge CMO Dr Narmada, Medical Superintendent of SV Ayurvedic Hospital  Dr Renu Dixit was also present.

Later the EO had a detailed review on pupil strength, faculty vacancies, funding, courses, placements and other topics related to various educational institutions run under the umbrella of TTD.

Sri Rani Sadasivamurty, the Vice Chancellor of Sri Venkateswara Vedic University, new Devasthanam Educational Officer Sri Nagaraja Naidu, Principals and Head masters of various colleges and schools of TTD were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ఆసుపత్రులు మరియు విద్యాసంస్థల కార్యకలాపాలపై సమీక్షించిన –
ఈవో శ్రీ జె.శ్యామలరావు

టీటీడీ నిర్వహిస్తున్న ఆసుపత్రులు, విద్యా సంస్థలపై టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు సమీక్షించారు.

తిరుమల, 2024 జూలై 12: తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో జేఈవో (విద్యా, ఆరోగ్యం) శ్రీమతి గౌతమితో పాటు ఆయా ఆసుపత్రులు, విద్యాసంస్థల అధిపతులతో శుక్రవారం సాయంత్రం ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు.

ఇందులో భాగంగా స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌వి కుమార్‌ స్విమ్స్‌ సూవర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వస్తున్న రోగులకు అందిస్తున్న చికిత్సలు, సౌకర్యాలను ఈవోకు వివరించారు.

తర్వాత శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి ఇప్పటివరకు చిన్నపిల్లలకు 2,901 గుండె శాస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. ఇందులో 1,544 ఓపెన్ హార్ట్ మరియు 1,357 కీ హోల్ సర్జరీలు ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల నుండే కాక అండమాన్, బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చి రోగులు శాస్త్ర చికిత్సలు పొందినట్లు ఆయన తెలిపారు.

గత మూడేళ్లలో శ్రీ పద్మావతి హృదయాలయంలో ఉచితంగా నిర్వహించిన 16 గుండె మార్పిడిలను, ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవోకు వివరించారు.

ఈ సమీక్ష కార్యక్రమంలో స్విమ్స్‌ నుంచి డాక్టర్‌ రామ్‌, డాక్టర్‌ జయచంద్రారెడ్డి, బర్డ్ ఆసుపత్రి ఆర్‌ఎంవో శ్రీ కిషోర్‌, వైద్యులు డాక్టర్‌ వేణుగోపాల్‌, టీటీడీ సీఎంవో డాక్టర్‌ మురళీధర్‌, ఇంచార్జి సీఎంవో డాక్టర్‌ నర్మద, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి ప్రిన్సిపల్ మరియు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్‌ రేణు దీక్షిత్‌ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ విద్యాసంస్థలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య, అధ్యాపకుల ఖాళీలు, నిధులు, కోర్సులు, ప్లేస్‌మెంట్‌లు తదితర అంశాలపై ఈవో సవివరంగా సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం విసి శ్రీ రాణి సదాశివమూర్తి, నూతన దేవస్థానం విద్యాశాఖాధికారి శ్రీ నాగరాజ నాయుడు, టీటీడీలోని వివిధ కళాశాలల మరియు పాఠశాలల ప్రిన్సిపాల్స్ మరియు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.