EO REVIEWS WITH ARCHAKAS AND AGAMA ADVISORS _ శ్రీవారి ఆలయ అర్చకులు మరియు ఆగమ సలహాదారులతో ఈవో సమీక్ష

Tirumala, 01 July 2024: TTD EO Sri J Syamala Rao on Monday evening reviewed on several temple-related rituals, practices as per tenets of Vaikhanasa Agama, religious functionaries and related subjects.

Along with JEOs Smt Goutami, Sri Veerabrahmam, Agama Advisors, Pradhana Archakas, Tirumala temple staff were present in the review meeting.

Earlier Pradhana Archakas Sri Venugopala Deekshitulu, Sri Krishna Seshachala Deekshitulu, Sri Govindaraja Deekshitulu of Tirumala temple briefed EO on various rituals and Kainkaryams being performed in Tirumala as per the tenets of Vaikhanasa Agama. 

The Archakas suggested EO to think of giving apprenticeship to Vedic students of Dharmagiri Veda Vignana Peetham which would help them to build their career.

They also sought the EO to perform Visesha Puja at least once in a year,  the Weekly Seva which used to be performed on Mondays as Arjita Seva.

Later Sri Sreenivasa Deekshitulu of Sri Govindaraja Swamy temple in Tirupati, brought to the notice of EO to enhance Prasada Dittam which was reduced during Covid period and still continuing.

The Agama Advisors informed EO their role and how they function in safeguarding the ancient traditions and customs, ensuring that the rituals are not deviated.

After these two meetings, the EO also Reviewed on Srivari Anna Prasadams along with the temple and potu officials.

Agama Advisors Sri Mohanarangacharyulu, Sri Seetaramacharyulu, Sri Ramakrishna Deekshitulu, temple DyEO Sri Lokanatham, Potu Peishkar Sri Srinivasulu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయ అర్చకులు మరియు ఆగమ సలహాదారులతో ఈవో సమీక్ష

తిరుమల, 2024 జూలై 01: శ్రీవారి ఆలయానికి సంబంధించిన పలు ఆచార వ్యవహారాలు, వైఖానస ఆగమోపచారాలు, పలు అంశాలపై ఆలయ అర్చకులు, ఆగమ పండితులతో టీటీడీ ఈవో జె.శ్యామలరావు సమీక్షించారు.

సమీక్షా సమావేశంలో జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు, ప్రధాన అర్చకులు, తిరుమల శ్రీవారి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

అంతకుముందు తిరుమలలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా జరుగుతున్న వివిధ ఆచారాలు, కైంకర్యాల గురించి ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీకృష్ణ శేషాచల దీక్షితులు, శ్రీ గోవిందరాజ దీక్షితులు ఈఓకు వివరించారు.

ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలోని వేద విద్యార్థులకు అపరెంటీస్ గా అవకాశం కల్పించి, వారు భవిష్యత్తును నిర్మించుకునేలా చేయాలని అర్చకులు ఈఓకు సూచించారు.

గతంలో ప్రతి సోమవారం ఆర్జిత సేవగా నిర్వహించే విశేష సేవను కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా నిర్వహించాలని ఈఓను కోరారు.

అనంతరం తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయానికి చెందిన శ్రీ శ్రీనివాస దీక్షితులు మాట్లాడుతూ, కోవిడ్‌ కాలంలో తగ్గించిన ప్రసాద దిట్టం ఇంకా కొనసాగుతూనే ఉందని, దానిని పెంచాలని ఈఓ దృష్టికి తీసుకెళ్లారు.

ఆగమ సలహాదారులు ఆలయం ప్రతిష్టటకు భంగం కలుగకుండా పురాతన సంప్రదాయాలు పరిరక్షించడంలో, ఆచారాలకు విఘాతం కలుగకుండా చూసుకోవడంలో తమ పాత్రను ఈఓ కు తెలియజేశారు.

ఈ రెండు సమావేశాల అనంతరం శ్రీవారి అన్నప్రసాదాలపై ఆలయ, పోటు అధికారులతో ఈఓ సమీక్షించారు.

ఈ సమావేశంలో ఆగమ సలహాదారులు శ్రీ మోహనరంగాచార్యులు, శ్రీ సీతారామాచార్యులు, శ్రీరామకృష్ణ దీక్షితులు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పోటు పీష్కార్ శ్రీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.