EO VISITS TTD TAKEN OVER TEMPLES _ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆలయాల అభివృద్ధి పనులు – టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి

TIRUPATI, 14 SEPTEMBER 2021: TTD EO Dr KS Jawahar Reddy visited TTD taken over temples in GD Nellore constituency in Chittoor district along with Honourable DyCM Sri Narayana Swamy on Tuesday.

Speaking on the occasion the EO said the Honourable DyCM is keen to develop the taken over temples in his constituency and invited him to visit the temples.

The EO said TTD has taken up several dharmic and spiritual activities which are being telecasted live on SVBC for the sake of global devotees. He said “all of us are busy with our way of life. But at the same time we should spare some time in knowing the rich values in Arsha Dharma through vedas.

Adding further EO said Kalikirikonda appears akin to Tirumala Seshachala ranges with its serene beauty and also has tourism potential. “We will discuss on how to develop these temples under SRIVANI Trust “, he maintained.

Apart from Kalikiri konda, EO also visited TTD Kalyana Mandapam site in Penumuru, Sri  Varada Venkateswara temple in Alathur. Later the EO also discussed with the officials concerned over the construction of Neerali Mandapam in Skanda Pushkarini at Karvetinagaram and also a shelter for pilgrims.

CE Sri Nageswara Rao, SE Sri Satyanarayana, EEs Sri Manoharam, Sri Sivarama Krishna and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆలయాల అభివృద్ధి పనులు-  టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి
 
తిరుపతి, 14, సెప్టెంబర్ 2021: గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని టీటీడీ ఆలయాల్లో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్  జవహర్ రెడ్డి  చెప్పారు.  ఉప ముఖ్యమంత్రి శ్రీ కె.నారాయణ స్వామితో కలిసి మంగళవారం ఆయన జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని ఆలత్తూరు, కలికిరి కొండ, కార్వేటినగరం ఆలయాలను సందర్శించారు. ఆలయాల్లో స్వామి వార్ల దర్శనం అనంతరం వీరు అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు.
 
ఈ సందర్భంగా కార్వేటినగరం పుష్కరిణి వద్ద జరిగిన సమావేశంలో ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి  మాట్లాడుతూ,  ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి తన నియోజకవర్గంలోని  టీటీడీ ఆలయాల్లో  పలు అభివృద్ధి పనులు చేయాలని కోరినట్లు చెప్పారు. ఇందుకోసం తనను ఆలయాలను పరిశీలించాలని కోరారని,  కోవిడ్  వల్ల పర్యటన ఆలస్యమైందని చెప్పారు. ఆలత్తూరు లోని శ్రీ వరద వేంకటేశ్వర స్వామి ఆలయం, కార్వేటినగరం వేణుగోపాల స్వామి ఆలయం , కలికిరి కొండ శ్రీవారి ఆలయాలను మంగళవారం పరిశీలించామని చెప్పారు.  కలికిరి కొండ వెళ్లే భక్తులకు తిరుమలకు వెళ్లిన అనుభూతి కలుగుతుందన్నారు. ఈ కేంద్రాన్ని ఆధ్యాత్మిక,  పర్యాటక పరంగా అభివృద్ధి చేయొచ్చని చెప్పారు. నియోజకవర్గంలోని టీటీడీ ఆలయాలకు సంబంధించిన అభివృద్ధి పనులను శ్రీవాణి ట్రస్ట్ సమావేశంలో చర్చించి మంజూరు చేస్తామని చెప్పారు. ఎస్వీబీసి ద్వారా టీటీడీ ప్రతిరోజు ప్రసారం చేస్తున్న భగవద్గీత, గరుడ పురాణం లాంటి అనేక కార్యక్రమాలను ప్రజలు వీక్షించి ఆధ్యాత్మిక అలవాటు చేసుకోవాలని ఆయన కోరారు.
 
ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి మాట్లాడుతూ,  ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో హిందూ ఆలయాలను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.  కార్వేటినగరంలో శ్రీ వేణు గోపాల స్వామి కోనేరు మధ్యలో నిర్మిస్తున్న నీరాలి మండపాన్ని మరింత వెడల్పు చేయాలని కోరారు. టిటిడి కళ్యాణ మండపం లో వంటగది, మరుగుదొడ్లు, వసతి గదులు అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని కోరారు. టీటీడీ చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు తో పాటు SE శ్రీ సత్యనారాయణ, EE శ్రీ శివరామకృష్ణ, మనోహర్ పలువురు అధికారులు ఉన్నారు.
 
టిటిడి ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది.