FESTIVALS OF KRT IN FEB _ ఫిబ్ర‌వ‌రిలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 3 Feb. 20: TTD is organising several festivals at the Sri Kodandarama Swamy Temple in Tirupati in the month of February.

Following are details:

* February 1, 8,15, 22, 29 on all Saturdays Abhisekam to mulavirat of Sitarama lakhmana and devotees could participate with₹20 ticket.

In the evening there would be Tiruchi procession of utsava idols 

* February 7, Sitarama Kalyanam, l Tiruchi vahanam and unjal seva for which devotee couple could participate with ₹500 ticket.

* February 9 Pournami Kupuchandra peta utsavam.

* February 23, Amavasya

Sahasra Kalashabisekam in which devotees could participate with ₹500 ticket. Hanumanta vahanam in the evening.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఫిబ్ర‌వ‌రిలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2020 ఫిబ్ర‌వ‌రి 03: తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో ఫిబ్ర‌వ‌రి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– ఫిబ్ర‌వ‌రి 1, 8, 15, 22, 29వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. రూ.116/- టికెట్ కొనుగోలు చేసి ఊంజ‌ల్‌సేవ‌లో పాల్గొన‌వ‌చ్చు.

– ఫిబ్ర‌వ‌రి  7న పున‌ర్వ‌సు న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం నిర్వ‌హిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీ రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద‌కు ఊరేగింపుగా తీసుకెళ‌తారు. సాయంత్రం 6.30 గంట‌ల‌కు ఊంజ‌ల్‌సేవ నిర్వ‌హిస్తారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు.

– ఫిబ్ర‌వ‌రి  9న పౌర్ణమి సందర్భంగా  శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారికి కూపుచంద్రపేట ఉత్స‌వం వైభ‌వంగా జరుగనుంది.

– ఫిబ్ర‌వ‌రి 23న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు. రాత్రి 7.00 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.