FESTIVITIES LINED UP _ జనవరి 15న శ్రీవారి పార్వేట ఉత్సవం
TIRUMALA, 14 JANUARY 2025: Festivities have been lined up on Wednesday in Tirumala temple.
To start with the unique fete Kakabali will be observed in the early hours in the Srivari temple.
Following Goda Parinayam, the Andal Goda Malas brought from Sri Govindaraja Swamy temple reaches Pedda Jeeyar mutt and from there to Srivari temple in a procession.
The same will be decorated to the presiding deity during Goda Parinayotsavam in the evening.
On the other hand, following the Kanuma festival, Paruveta Utsavam will be observed from 1pm onwards.
As per tradition, Pranaya Kalahotsavam will be observed in the evening in front of Swamy Pushkarini from 4:30pm onwards.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జనవరి 15న శ్రీవారి పార్వేట ఉత్సవం
• శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం
• సాయంత్రం ప్రణయకలహోత్సవం
తిరుపతి, 2025 జనవరి 14: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన జనవరి 15న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు.
గోదాపరిణయోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్‌స్వామి మఠం నుండి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకు వెళ్ళి స్వామివారికి సమర్పిస్తారు.
ఆనంతరం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు.
శ్రీవారి ప్రణయకలహోత్సవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన దేవేరులతో కలిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 15వ తేదీ సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు తిరుమలలో జరుగనుంది.
ఆర్జితసేవలు రద్దు :
ఈ ఉత్సవాల కారణంగా జనవరి 15న శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.