FINANCIAL AIDS TO THE TEMPLES FROM SRIVANI TRUST FUNDS AS PER GUIDELINES-EO _ నిబంధనల ప్రకారం పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు శ్రీవాణి నిధులు-టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

TIRUMALA, 16 JULY 2023: The financial aid will be provided towards the renovation of old and construction of new temples from Sri Venkateswara Alaya Nirmana (SRIVANI) Trust of TTD as per the guidelines, asserted TTD EO Sri AV Dharma Reddy.

During the monthly Dial your EO programme held at Annamaiah Bhavan in Tirumala on Sunday, the EO received feedback from 23 callers across the country. Some excerpts:

Pilgrim callers Sri Venkatesh from Chennai and Sri Srikanth from Manchiryala sought the TTD EO to renovate the temples in their respective areas which are under dilapidated condition. Answering the callers, the EO said the temple construction will be taken place from SRIVANI funds as per the guidelines after a team from TTD will visit their place for verification. 

Elaborating further, the EO said, TTD has commenced SRIVANI Trust in 2018. Linking of one-time VIP Break darshan to the donor who donates Rs.10,000 one person to the Trust has fetched nearly Rs.880 crores to the Trust besides curbing middlemen menace. Every single penny of the fund is being utilized to renovate and construct temples. The construction of new temples takes place in four ways, viz. through TTD, with the AP Endowments department, Village Committees and Samarasata Seva Foundation(SSF). But in recent times some vested interests are misleading the people that the SRIVANI funds are getting diverted and we are not issuing the donors correct receipts for the payments they made which is completely far from the truth. So far since 2019 about nine lakhs devotees have had darshan under SRIVANI Trust. We have not received a single complaint or mail from any of these devotees. I appeal to devotees not to fall prey to such baseless and false propaganda against TTD and SRIVANI funds. If you have any doubts you can obtain the details from TTD anytime”, he reiterated.

Sri Sriram from Visakhapatnam suggested EO to send physically challenged and senior citizens separately to which EO replied after allowing Senior citizens the physically challenged pilgrims will be allowed for darshan henceforth. 

Sri Raju from Vanaparty informed EO that the Srivarimettu luggage delivery system needs to be streamlined on the lines of the Alipiri footpath route to which EO said, TTD has completely modernized the Luggage receiving and delivery system in a transparent manner and implemented in the Alipiri route in last month which is yielding good results. Very soon the same will be implemented in the Srivari Mettu footpath route also, he added.

Another devotee Sri Eswar Prasad from Irala brought to the notice of EO about the huge charges by an eatery located in the Srivarimettu footpath route to which EO said TTD will look into the possibility of introducing Annaprasadam in that area.

When Sri Madhu Kulkarni from Karnataka asked EO to extend the accommodation for two days the EO said there are only 7000 odd rooms in Tirumala while the pilgrim footfall is almost one lakh and it is not possible to provide rooms beyond 24 hours.

Sri Reddy from Rayachoti brought to the notice of EO about the menace of dalaris and beggars at Vishnu Nivasam near Tirupati Railway station in Tirupati and how they are misguiding the devotees. He also informed EO to display proper information boards at Vishnu Nivasam where Sarva Darshan tokens are issued. EO replied to the caller that the issues will be brought to the notice of District Administration as Tirupati Railway station falls under their jurisdiction and necessary information boards will be displayed at Vishnu Nivasam.

When Sri Ravi Kumar from Bengaluru asked the EO to find a way to avoid congestion near Bangaru Vakili, the EO replied that since one month only a single line is being operated from Maha Dwaram to Bangaru Vaikili to avoid congestion.

Smt Munilakshmi from Nellore while appreciating the pilgrim initiatives by TTD sought EO to release Rs.300 quota and later Virtual Sevas online to which EO replied it is not possible as the darshan quota will be made available only after Virtual Sevas are released.

Devotees Sri Pravin from Maharastra, Sri Venugopal from Hyderabad appreciated the SVBC programs and TTD initiatives.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, SVBC CEO Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao and some other HoDs were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నిబంధనల ప్రకారం పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు శ్రీవాణి నిధులు

– ట్రస్టు నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్న ప్రచారాన్ని నమ్మకండి

– డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 2023, జూలై 16: పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణకు నిబంధనల ప్రకారం శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆదివారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో మంచిర్యాలకు చెందిన శ్రీ శ్రీకాంత్, చెన్నైకి చెందిన శ్రీ వెంకటేష్ అనే భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానమిస్తూ దాదాపు 9 లక్షల మంది భక్తులు ఇప్పటివరకు శ్రీవాణి ట్రస్టుకు దాదాపు రూ.880 కోట్ల విరాళాలు ఇచ్చినట్టు తెలిపారు. ఈ నిధులతో దాదాపు 2500 ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ధూపదీప నైవేద్యాల కోసం ప్రతినెలా రూ.5 వేలు అందిస్తున్నట్టు చెప్పారు. శ్రీవాణి ట్రస్టు నిధులు దుర్వినియోగమయ్యాయని ఇటీవల కొంతమంది దుష్ప్రచారం చేశారని, భక్తులు ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని మంచినీళ్ల గుంటను అభివృద్ధి చేసి శ్రీ గోవిందరాజ స్వామివారి విగ్రహాన్ని ప్రజలు చూసే అవకాశం కల్పిస్తామన్నారు.

1. ప్రవీణ్ కుమార్ – మహారాష్ట్ర

ప్రశ్న: అంగప్రదక్షిణ టోకెన్లు ఆఫ్ లైన్లో కూడా ఇవ్వండి.

ఈవో : ఎక్కువమంది భక్తులకు సౌకర్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఆన్లైన్లో అంగప్రదక్షిణ టోకెన్లు జారీ చేస్తున్నాం.

2. స్వామి – అనంతపురం

ప్రశ్న: శ్రీవారి సేవకు వచ్చాము. ఫోన్ నెంబర్ మార్చాలని విజ్ఞప్తి చేశాం. కొత్త నెంబర్ తో నమోదు చేసుకోవడానికి వీలు కావడం లేదు.

ఈవో : తప్పకుండా మార్పు చేస్తాం.

3. శంకర్ గౌడ్ – హైదరాబాద్

ప్రశ్న: రూ.300/- దర్శన టికెట్లు మూడు నెలల ముందుగా విడుదల చేస్తున్నారు. మహిళలకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఒక నెల ముందు విడుదల చేయండి.

ఈవో : ఎక్కువమంది భక్తుల కోరిక మేరకు మూడు నెలల ముందుగా రూ.300/- దర్శన టికెట్లు విడుదల చేస్తున్నాం. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి 4 వేల రూ.300/- దర్శన టికెట్లు టికెట్లు అదనంగా విడుదల చేస్తాం.

4. దుర్గాప్రసాద్ – అనకాపల్లి

ప్రశ్న : లక్కీ డిప్ లో ఆర్జిత్ సేవా టికెట్లు దొరకడం లేదు.

ఈవో : లక్కీ డిప్ లో ఆర్జిత్ సేవా టికెట్లు తక్కువగా ఉన్నాయి. స్వామివారిని ప్రార్థించి ప్రయత్నించండి.

5. హరి – మంచిర్యాల

ప్రశ్న : సీనియర్ సిటిజన్లకు కాటేజీల్లో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేలా చూడండి.

ఈవో : రిసెప్షన్ అధికారులకు ఈ మేరకు ఆదేశాలిస్తాం.

6. మనోహర్ – జగిత్యాల

ప్రశ్న : తలనీలాలు సమర్పించే ప్రాంతంలో క్షురకులు డబ్బులు అడగకుండా కంట్రోల్ చేయండి.

ఈవో : భక్తులు ఎవరూ డబ్బులు ఇవ్వకపోతే సమస్య పరిష్కారం అవుతుంది. క్షురకులు డబ్బులు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. తరచుగా కౌన్సెలింగ్ ఇస్తున్నాం.

7. కర్నూలు – రతీదేవి

ప్రశ్న : శ్రీవారి సేవకులకు సేవాసదన్లో అన్నప్రసాదాలు అందించండి.

ఈవో : శ్రీవారి సేవకుల కోసం వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ప్రత్యేక హాలు కేటాయించి అన్నప్రసాదాలు అందిస్తున్నాం. సేవాసదనంలో అన్న ప్రసాదాలు అందించే విషయాన్ని పరిశీలిస్తాం.


8. రవికుమార్, బెంగళూరు, సుహాసిని- నంద్యాల

ప్రశ్న : బంగారు వాకిలి వద్ద టీటీడీ సిబ్బంది భక్తులను లాగేస్తున్నారు.

ఈవో : భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకునేలా మహద్వారం నుంచి గర్భాలయం వరకు ఒకే వరుస విధానాన్ని అమలు చేస్తున్నాం.

9. రెడ్డి – రాయచోటి

ప్రశ్న: రైల్వే స్టేషన్, విష్ణునివాసం ప్రాంతాల్లో భిక్షాటకులు, అపరిచిత వ్యక్తుల సంచారం ఎక్కువగా ఉంది. విష్ణునివాసంలో ఎస్ఎస్డి టోకెన్లకు సంబంధించి సూచిక బోర్డు లేదు.

ఈవో : రైల్వే స్టేషన్, విష్ణు నివాసం ప్రాంతాల్లో భిక్షాటకులు, అపరిచిత వ్యక్తుల సంచారంపై జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తాం. విష్ణు నివాసంలో ఎస్ఎస్డి టోకెన్లకు సంబంధించి సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం.

10. మణికంఠ – పలమనేరు

ప్రశ్న : లడ్డూ కౌంటర్ వద్ద కుటుంబ సభ్యులందరూ వెళితేనే లడ్డూలు ఇస్తున్నారు. లేకపోతే ఇవ్వడం లేదు.

ఈవో : దళారులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. భక్తులు సహకరించగలరు.

11. మునిలక్ష్మీ – నెల్లూరు

ప్రశ్న: ఆర్జిత సేవలు, వర్చువల్ సేవలు ఒకేరోజు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. దీనివల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వేరే వేరే రోజుల్లో విడుదల చేయండి.

ఈవో: పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం.

12. శ్రీరామ్ – విశాఖ

ప్రశ్న : వికలాంగులను, వృద్ధులను ఒకేసారి కాకుండా వేరువేరుగా దర్శనానికి పంపండి.

ఈవో : అలాగే పంపుతాం.

13. హనుమంతరావు – గుంటూరు

ప్రశ్న : తిరుమలలో గది తీసుకున్నాం. రీఫండ్ రాలేదు.

ఈవో : మీకు ఫోన్ చేసి రీఫండ్ వివరాలు తెలియజేస్తాం.

14. వేణుగోపాల్ – హైదరాబాద్

ప్రశ్న : ఎస్విబిసి తెలుగు ఛానల్ లో ఇతర భాషల కార్యక్రమాలను నిలుపుదల చేయండి.

ఈవో : భక్తులకు సౌకర్యంగా ఉండేలా కార్యక్రమాలు ప్రసారం చేస్తాం.

15. రాజు – వనపర్తి

ప్రశ్న : శ్రీవారి మెట్టు మార్గంలో లగేజ్ డిపాజిట్ చేసి నడిచి వచ్చాం. తిరుమలలో తిరిగి తీసుకోవడం ఇబ్బందిగా మారింది.

ఈవో : లగేజ్ కలెక్షన్, డెలివరీ సిస్టం పేరుతో నూతన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఈ వ్యవస్థలో క్యూఆర్ కోడ్ స్లిప్ జారీ చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లగేజీ అందజేస్తాం.

16. ఈశ్వర్ ప్రసాద్ – ఐరాల

ప్రశ్న : శ్రీవారి మెట్టు మార్గంలో అల్పాహారం కోసం దుకాణాల వద్ద అధిక ధరలు వసూలు చేస్తున్నారు.

ఈవో : అధిక ధరలు వసూలు చేస్తున్న దుకాణాలపై చర్యలు తీసుకుంటాం. శ్రీవారి మెట్టు మార్గం మొదట్లో అన్నప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటాం.

17. మధు కులకర్ణి – కర్ణాటక

ప్రశ్న : తిరుమలలో గదులు పొందిన భక్తులు మరో రెండు రోజులు పొడిగించుకునే అవకాశం కల్పించండి.

ఈవో : తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉంది. ఎక్కువమంది భక్తులకు అవకాశం కల్పించాలి కావున 2 రోజులు పొడిగించుకునే అవకాశం లేదు.

18 .వెంకటరమణమూర్తి – హైదరాబాద్

ప్రశ్న : ఎన్నారై భక్తురాలు దర్శన టికెట్ కోసం ప్రయత్నిస్తే ఇవ్వలేదు.

ఈవో : ఎన్నారైలు తమ అర్హతను చూపితే 300 రూపాయలు టికెట్ జారీచేసి స్వామివారి దర్శనం కల్పిస్తున్నాం.

19. రామిరెడ్డి – కర్నూలు

ప్రశ్న : కర్నూలులో శ్రీవారి లడ్డూలు పొందే అవకాశం కల్పించండి.

ఈవో : హైదరాబాదుకు లడ్డూలు తీసుకువెళ్లే వాహనం ద్వారా కర్నూలులో ప్రయోగాత్మకంగా వెయ్యి లడ్డూలతో ఈ సౌకర్యాన్ని కల్పిస్తాం.

ఈ కార్యక్రమంలో జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, అన్న ప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి, విజివో శ్రీ బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.