FIRST OF ITS KIND PAEDIATRIC CARDIAC HOSPITAL OPENED IN TIRUPATI BY AP CM _ ముఖ్యమంత్రి చేతులమీదుగా శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి ప్రారంభం

TIRUMALA, 11 OCTOBER 2021: The Honourable Chief Minister of Andhra Pradesh Sri YS Jagan Mohan Reddy on Monday inaugurated Sri Padmavathi Paediatric Cardiac Hospital, the first of its kind, an exclusive children’s’ heart hospital in entire Andhra Pradesh at Tirupati.

This 50-bed hospital will be initially housed in TTD-run Sri Balaji Institute of Surgery, Research and Rehabilitation for the Disabled (BIRRD) Hospital, in the first floor of old OPD block, on a temporary basis to serve the ailing children with heart related problems.

The building has eight wings including Entrance, OP, Radiology, Pre-ICU, Post-ICU, Operation Theatre, General Ward and Administrative blocks.

The total expenditure on civil, electrical, necessary medical equipment including Cath Lab, Heart-Lung machine, Cardiography system machines etc. is Rs.25crore.

MPs Sri Gurumurty, Sri Mithun Reddy, Sri V Prabhakar Reddy, local MLA Sri Karunakar Reddy, TTD Chairman Sri YV Subba Reddy, JEO Sri Veerabrahmam, board member Sri P Ashok Kumar, SVIMS Director Dr Vengamma, OSD BIRRD Dr Reddeppa Reddy and others were also participated in this inaugural event

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముఖ్యమంత్రి చేతులమీదుగా శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి ప్రారంభం

తిరుప‌తి, 2021 అక్టోబ‌రు 11: తిరుప‌తిలోని బ‌ర్డ్ ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో ఏర్పాటుచేసిన‌ శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిని సోమ‌వారం ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. ఆసుప‌త్రి వ‌ద్ద‌కు చేరుకున్న గౌ|| ముఖ్య‌మంత్రికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి పుష్ప‌గుచ్ఛాలు అందించి స్వాగ‌తం ప‌లికారు. ఆసుప‌త్రి ప్ర‌త్యేక‌త‌ల‌పై రూపొందించిన మూడు నిమిషాల నిడివి గ‌ల వీడియోను ముఖ్య‌మంత్రి వీక్షించారు.

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతిలో చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిని టిటిడి ఏర్పాటు చేసింది. టిటిడి బర్డ్‌ ఆసుపత్రిలో మొదటి దశలో 44,670 చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ.25 కోట్ల వ్యయంతో, 50 పడకలతో ఈ ఆసుపత్రిని ఏర్పాటుచేశారు. ఇందులో ఓపి బ్లాక్‌లో 5 కన్సల్టేషన్‌ గదులు, రోగులు వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. రేడియాలజీ బ్లాక్‌లో ఎక్సరే రూమ్‌, క్యాథ్‌ ల్యాబ్‌, మరుగుదొడ్లతోపాటు రోగులు వేచి ఉండేందుకు ఏర్పాట్లు జ‌రిగాయి. 15 పడకలతో ప్రి ఐసియు బ్లాక్‌, 15 పడకలతో పోస్ట్‌ ఐసియు బ్లాక్‌, మూడు ఆపరేషన్‌ థియేటర్లు, 20 పడకలతో రెండు జనరల్‌ వార్డులు, మరుగుదొడ్లు ఉన్నాయి. పరిపాలనా విభాగంలో కార్యాలయం, డాక్టర్ల గదులు, డైరెక్టర్‌ ఛాంబర్‌, సమావేశ మందిరం, మరుగుదొడ్లు నిర్మించారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి, మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ వెలం పల్లి శ్రీనివాసరావు, శాసన సభ్యులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి, కోడూరు శ్రీనివాసులు, మేడా మల్లిఖార్జున్ రెడ్డి, ఎంపిలు డాక్టర్ గురుమూర్తి, శ్రీ మిథున్ రెడ్డి, శ్రీఏ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ హరి నారాయణ్ , టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, జెఈవో, శ్రీ వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, బర్డ్ సీఎస్ ఆర్ ఎం ఓ శ్రీ శేషశైలేంద్ర, ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్పరెడ్డి,పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.