FIRST PHASE OF AKHANDA BALAKANDA PARAYANAM ON SEPTEMBER 2 _ సెప్టెంబరు 2న ఒకటో విడ‌త‌ బాలకాండ అఖండ పారాయ‌ణం

Tirumala, 31 August 2021: With the objective of relieving the humanity from the clutches of pandemic Corona, the TTD is organising the first phase of Balakanda Akhanda Parayanam titled as Balakand- Sakala Sampatpradam at Nada Neeranjanam platform on September 2.

 

The SVBC shall provide live telecast of the Parayanam from 7am to 9am.

 

Vedic pundits from SV Veda Vijnan Peetham, SV Vedic University, TTD pundits, Sri Annamacharya Project and National Sanskrit University faculty members and other officials.

 

In all 143 shlokas from first and second Sargas of Balakanda will be undertaken by the Dharmagiri Veda Vignana Peetham scholar Dr Ramanujam while 

Dr Prava Ramakrishna, lecturer of SV Veda University will give commentary.

 

TTD has appealed to all Srivari devotees to take benefit of SVBC live telecast and beget Srivari blessings.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబరు 2న ఒకటో విడ‌త‌ బాలకాండ అఖండ పారాయ‌ణం

 తిరుమల, 2021 ఆగస్టు 31: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై సెప్టెంబరు 2వ తేదీ  గురువారం “బాలకాండ – సకల సంపత్ప్రదం” పేరిట ఒకటో విడ‌త‌ బాలకాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వ విద్యాలయం, తి. తి. దే. వేదపండితులు, తి. తి. దే. సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయాల అధికారులు – పండితులు – అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

బాలకాండలోని 1, 2 సర్గలు కలిపి 143 శ్లోకాలను పారాయణం చేస్తారు. ధ‌ర్మ‌గిరి వేద‌విజ్ఞాన‌పీఠం శాస్త్ర పండితులు డా. రామానుజం శ్లోక పారాయ‌ణం చేస్తారు. ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం అధ్యాప‌కులు డా. ప్ర‌వ రామ‌కృష్ణ వ్యాఖ్యానం అందిస్తారు.

ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.