FIRST SCHEDULE OF ADIVO ALLADIVO CONCLUDES _ అదివో.. అల్ల‌దివో.. కార్య‌క్ర‌మం మొదటి షెడ్యూల్ పూర్తి

EO PARTICIPATES

 

TIRUPATI, 08 DECEMBER 2021: The first schedule of the prestigious and unique, “Adivo Alladivo”-Annamacharya Songs recording programme with new talents mulled by TTD concluded on Wednesday.

 

Speaking on the occasion, TTD EO Dr KS Jawahar Reddy said, the idea behind this program is to popularise new compositions of Annamacharya to public identifying new singing talents. The programme is named after the most popular Kriti of the saint poet, Adivo Alladivo. The EO said TTD Chairman Sri YV Subba Reddy has also released the promo of the programme some time ago.

 

Adding further, EO said though the idea popped up in his mind, the Chairman of SVBC Dr Saikrishna Yachendra, who himself is a stalwart musician has brought the concept in an extraordinary way. About 82 youth aged between 15-25years have got selected so far from Chittoor and Nellore districts alone. In the first schedule, we have recorded the Sankeertans by these singers. Soon these programmes will be telecasted on SVBC”, he maintained.

 

Chairman SVBC Dr Saikrishna Yachendra, CEO SVBC Sri Suresh Kumar, versatile singers who are supervising the program proceedings Dr SP Sailaja, Dr P Ranganath were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

అదివో.. అల్ల‌దివో.. కార్య‌క్ర‌మం మొదటి షెడ్యూల్ పూర్తి

పాల్గొన్న టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి

తిరుపతి, 2021 డిసెంబ‌రు 08: అన్నమయ్య సంకీర్తనలను మరింత విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు ఎస్వీబీసీ ఆధ్వర్యంలో రూపొందించిన అదివో.. అల్ల‌దివో.. పాటల పోటీ కార్యక్రమం మొదటి షెడ్యూల్ బుధవారం పూర్తయింది. తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి విచ్చేశారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అన్నమయ్య కొత్త సంకీర్తనలను 15 నుంచి 25 సంవత్సరాల వయసు గల యువ కళాకారులతో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. అన్నమయ్య రచించిన ప్రముఖ సంకీర్తన అదివో అల్లదివో… పేరునే పెట్టామన్నారు. ఈ కార్యక్రమం ప్రోమోను టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి గతంలో ఆవిష్కరించారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆలోచన రాగానే ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ సాయికృష్ణ యాచేంద్రకు తెలిపానని, ఆయన ఎంతో చక్కగా ఈ కార్యక్రమ రూపకల్పన చేశారని కొనియాడారు. మొదట చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుండి యువ కళాకారులను పోటీలకు ఎంపిక చేశామన్నారు. ఈ షెడ్యూల్ లో మూడు ఎపిసోడ్లకు సంబంధించి రికార్డ్ చేశారని చెప్పారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రసారం చేస్తామన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ సాయికృష్ణ యాచేంద్ర, సిఈవో శ్రీ జి.సురేష్‌కుమార్‌, ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న ప్రముఖ గాయకులు శ్రీమతి ఎస్పీ శైలజ, శ్రీ పారుపల్లి రంగనాథ్ పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.