తెప్పపై సిరులతల్లి శ్రీ పద్మావతి అమ్మవారి విహారం
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తెప్పపై సిరులతల్లి శ్రీ పద్మావతి అమ్మవారి విహారం
తిరుపతి, 2019 జూన్ 16: సిరులతల్లి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తులను కటాక్షించారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, సామవేద పుష్పాంజలి నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 నుండి 5.00 గంటల వరకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 6.30 నుండి 7.45 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో అమ్మవారు ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం రాత్రి 8.30 నుండి 9.45 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు అభయమిచ్చారు. తెప్పోత్సవాల్లో చివరి రోజైన సోమవారం కూడా శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు.
ఈ కార్యక్రమంలో సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి , టిటిడి స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం,ఏవీఎస్వో శ్రీ నందీశ్వర్ రావు ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.