GRAND TEPPOTSAVAM AT SRI GT_ వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ప్రారంభం
Tirupati,13 February ,2018: The five day colourful and holy annual teppotsavam of Sri Govindaraja swamy Temple kicked off grandly this evening when the utsava idols of Sri Kodandarama Swami and his consorts were taken on a colourful flat ride.
Earlier the deities blessed the devotees when taken in a procession on the four mada streets as well.
On the inaugural day of the annual Float festival,the deities of Sri Kodandarama swami along with Sita and Lakshmana rode on the float five times in the Pushkarani of Sri Govindaraja temple.Tomorrow ,Thursday ,the deity of Sri Parthasarathy will be taken on the float ride.
The artists of HDPP and the Annamacharya project,presented bhajans, harikathas and Bhakti sangeet programs on the occasion.
TTD sub temples DyEO Smt Varalakshmi, AEO Sri Udayabhaskar Reddy, Supdt Sri Srihari ,Temple Inspector Sri Krishnamurthy and others participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2019 ఫిబ్రవరి 13: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు బుధవారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఐదు రోజుల పాటు జరుగనున్న ఈ తెప్పోత్సవాల్లో సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు స్వామివారు, అమ్మవారితో కలిసి తెప్పపై విహరించి భక్తులను కటాక్షించారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
ఇందులో భాగంగా మొదటిరోజు తిరుపతిలోని శ్రీ కోందరామస్వామివారి ఆలయం నుండి శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవర్లు ఊరేగింపుగా శ్రీగోవిందరాజస్వామివారి పుష్కరిణిి చేరుకున్నారు.
అనంతరం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తెప్పపై పుష్కరిణిలో విహరించారు. మొత్తం ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా గురువారం శ్రీపార్థసారథిస్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ శ్రీహరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, ఇతర అదికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.