FOCUS ON PANCHAGAVYA PRODUCTS- TTD EO _ పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీపై దృష్టి పెట్టండి : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Tirupati, 11 Jan. 21: TTD Executive Officer Dr KS Jawahar Reddy on Monday directed officials to pay attention on producing and marketing the products from the Cow Dung, Cow urine, etc. (Panchagavya Products) collected from Cows at SVV Goshala.

Speaking at a review meeting at Sri Padmavati Rest House with officials of Goshala and Ayurvedic Pharmacy, the TTD EO said the concerned should take hue from Sri Gopalbhai Sutaria of Bansigiri Goshala, Gujarat on promoting Cow population and other Cow products.

He urged officials to organise studies through agricultural university scientists on the use of Gokrupamrutam (cow manure- dung)

The EO also instructed the officials of SV Goshala and Ayurveda Pharmacy to study the feasibility of manufacturing products (soaps, incense sticks, and cleaning detergents) from Pancha gavya (cow products).

He said a team of TTD officials would soon visit the Bansigiri Goshala and that representatives of the same institution will be invited to train TTD officials in manufacturing and marketing those products here.

Thereafter Sri Gopalbhai Sutaria gave a presentation on production, utilities and marketing of the Panchagavya products like Capsules, Syrups, powder, soaps. Hair oil, massage oils, facial creams and other medicinal products.

TTD Board members Sri Govindhari, Additional EO Sri AV Dharma Reddy JEO Sri P Basant Kumar, SV Goshala Director Dr Harnath Reddy, Dr Murali Krishna, and Principal of SV Ayurveda College, Ayurveda pharmacy in charge Dr Narayan Reddy were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీపై దృష్టి పెట్టండి : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుప‌తి, 2021 జ‌న‌వ‌రి 11: దేశీయ గోవుల ద్వారా సేక‌రించే పంచ‌గ‌వ్యాల‌తో ప‌లు ఉత్ప‌త్తులు త‌యారు చేయ‌డంపై దృష్టి సారించాల‌ని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో సోమ‌వారం ఈవో ఎస్వీ గోశాల‌, ఆయుర్వేద ఫార్మ‌శీ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ గోసంత‌తి పెంపుద‌ల‌, అభివృద్ధికి సంబంధించి గుజ‌రాత్‌లోని శ్రీ గోపాల్ భాయ్ సుతారియ‌ ఆధ్వ‌ర్యంలో గ‌ల‌ బ‌న్సి గిర్‌ గోశాల‌లో తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను టిటిడి గోశాల‌లో అమ‌లు చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను కోరారు. వ్య‌వ‌సాయ క్షేత్రాల్లో వాడేందుకు వీలుగా ఉన్న‌ గోకృపామృతం(గో ఎరువులు) మోడ‌ల్‌ను వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం శాస్త్రవేత్త‌ల‌ దృష్టికి తీసుకెళ‌తామ‌న్నారు. పంచ‌గ‌వ్యాల‌తో త‌యారు చేసే ధూపం, స‌బ్బులు, అగ‌ర‌బ‌త్తీలు, ప‌రిశుభ్ర‌తా సామ‌గ్రి లాంటి ఉత్ప‌త్తుల్లో వీలైన‌న్ని టిటిడి గోశాల‌లో త‌యారీకి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎస్వీ గోశాల‌, ఆయుర్వేద ఫార్మశీ అధికారుల‌ను ఆదేశించారు. బ‌న్సి గిర్‌ గోశాల‌ కార్య‌క‌లాపాల‌ను ప‌రిశీలించేందుకు టిటిడి అధికారుల‌ను పంపుతామ‌ని, పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీపై శిక్ష‌ణ ఇచ్చేందుకు ఆ సంస్థ ప్ర‌తినిధుల‌ను పంపాల‌ని వారిని కోరారు.

అనంత‌రం పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీ, ఉప‌యోగాలు, మార్కెటింగ్ అంశాల‌పై శ్రీ గోపాల్ భాయ్ సుతారియ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. గిర్ గోవుల పంచ‌గవ్యాల ద్వారా త‌యారైన క్యాప్సూల్స్‌, సిర‌ప్‌లు, పౌడ‌ర్లు, స‌బ్సులు, హెయిర్ ఆయిల్, మ‌సాజ్ ఆయిల్‌, ఫేషియ‌ల్ క్రీమ్స్‌, ఇత‌ర మందుల గురించి తెలియ‌జేశారు.

ఈ స‌మీక్ష‌లో టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ గోవింద‌హ‌రి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, ఎస్వీ గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, ఎస్వీ ఆయుర్వేద క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ ముర‌ళీకృష్ణ‌, ఆయుర్వేద ఫార్మశీ ఇన్‌ఛార్జి డాక్ట‌ర్ నార‌ప‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.