FRESHERS DAY AT SV AYURVEDA COLLEGE _ ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో ఫ్రెషర్స్ డే

Tirupati,20, August 2022:  A fresher’s day was observed at the SV Ayurveda college run by the TTD 

As part of the festivities, students participated in Abhishekam and Homam for the Dhanvanthri statue in the Ayurveda college campus followed by anugraha blessing speech of Swami Sukrutanandaji of Ramakrishna mission, Tirupati.

He said everyone had a spark and skill and one should strive to display and espouse it. He exhorted all doctors to see Narayana in every patient and serve society in the path of Swami Vivekananda. 

Principal of SV Ayurveda college Dr Murali Krishna, Vice Principal Dr C Sundaram, Professor Renu Dikshit, faculty members and students were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో ఫ్రెషర్స్ డే

తిరుపతి, 2022, ఆగస్టు 20: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకగా జరిగింది.

ఈ సందర్భంగా ఉదయం కళాశాల ప్రాంగణంలో ధన్వంతరి విగ్రహానికి అభిషేకం, పూజ, ధన్వంతరి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామకృష్ణ మిషన్ తిరుపతి శాఖ అధ్యక్షులు స్వామి సుకృతానందజీ నూతన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ప్రతి వ్యక్తిలోనూ దివ్యత్వం, నైపుణ్యం ఉంటాయని, ప్రయత్నపూర్వకంగా వాటిని ప్రకటించడానికి, వ్యక్తీకరించడానికి ప్రయత్నించాలని సూచించారు. మంచి గుణాలు అలవర్చుకోవడం ద్వారా మంచి వ్యక్తులుగా తయారవుతారని చెప్పారు. ప్రతి రోగిలోనూ నారాయణుడిని దర్శించి వైద్యం చేయాలని కోరారు. ఆయుర్వేదం ద్వారా సమాజానికి విశిష్ట వైద్య సేవలు అందించే అవకాశం ఉందని అన్నారు. స్వామి వివేకానంద బోధనలు యువకులకు స్ఫూర్తినిచ్చి సరైన మార్గంలో నడిచే అవకాశం కల్పిస్తాయని, ప్రతి విద్యార్థి వివేకానందుని బోధనలు చదవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సి.సుందరం, ప్రొఫెసర్ రేణుదీక్షిత్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.