KAPILESWARA RIDES GAJA VAHANAM_ గజ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామి కనువిందు
Tirupati, 2 Mar. 19: Devotees were thrilled as Lord Kapileswara rode Gaja vahanam on Saturday evening during the ongoing Annual Brahmotsavams.
The Vahanam went around main roads of temple town with troupes of bhajan and kolatas as devotees rendered harati seeking Lords blessings.
Temple DyEO Sri Subramanyam, AEO Sri Nagaraju, Supdt Sri Raj, Priest Sri Swaminathan and Vijaya Swamy, Temple Inspector Sri Reddy Sekhar and others participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
గజ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామి కనువిందు
తిరుపతి,2019 మార్చి 02: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన శనివారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీకపిలేశ్వరస్వామివారు గజ వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయకనగర్ ఎల్ టైప్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ ఆలయం, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్క భజనలు ఆకట్టుకున్నాయి.
ఆద్యంతరహితుడైన శివదేవుని, ఐశ్వర్యసూచికమైన గజవాహనంపై దర్శించడం కోటిజన్మల తపఃఫలం.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఇవో శ్రీ నాగరాజు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, అర్చకులు శ్రీ స్వామినాథ స్వామి, శ్రీ విజయస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టరు శ్రీ రెడ్డిశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.