LORD KALYAN VENKANNA RIDES AS DARBAR KRISHNA_ చంద్రప్రభ వాహనంపై దర్బార్‌ కృష్ణుని అలంకారంతో క‌ల్యాణ శ్రీ‌నివాసుడు

Srinivasa Mangapuram, 2 Mar. 19: Lord rode on Chandraprabha vahanam as Darbaar Krishna avatar on the evening of Day 7 of annual Brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy Temple in Srinivasa Mangapuram.

On the pheasant Saturday evening Lord blessed devotees
on the Chandra Prabha vahanam heralding his command on all universe and as preserver and promoter of all life beings in universe.

Temple DyEO Sri Dhananjayulu, AEO Sri Lakshmaiah, Chief Priest Sri Balaji Rangacharyulu, Supdt Sri Changalrayulu, Temple Inspector Sri Anil and others participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

చంద్రప్రభ వాహనంపై దర్బార్‌ కృష్ణుని అలంకారంతో క‌ల్యాణ శ్రీ‌నివాసుడు

తిరుపతి,2019 మార్చి 02: శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శ‌నివారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల నడుమ క‌ల్యాణ శ్రీ‌నివాసుడు చంద్రప్రభ వాహనంపై దర్బార్‌ కృష్ణుని అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు.

శ‌నివారం రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమిచ్చి తన చల్లని అమృత కిరణాలతో భక్తులను అమృతస్వరూపులను చేస్తారు. నక్షత్రాలకు చంద్రుడు అధిపతి అయితే శ్రీవారు సమస్త విశ్వానికీ అధిపతి. వాహనం చంద్రుడు ఆహ్లాదకారి. శ్రీవారు చంద్రమండల మధ్యస్థుడై పరమాహ్లాదకారి అయ్యాడు. సర్వకళాసమాహారాత్మకుడైన ఆదినారాయణుడు తన కళల నుండి 16 కళలు చంద్రునిపై ప్రసరింపజేసినందున చంద్రుడు కళానిధి అయ్యాడు. చంద్రదర్శనంతో సముద్రం ఉప్పొంగినట్టు, చంద్రప్రభామధ్యస్థుడైన శ్రీకల్యాణచంద్రుణ్ణి దర్శించడంతో భక్తుల హృదయ క్షీరసాగరాలు ఉత్తుంగప్రమోద తరంగాలతో పొంగి ఆనందిస్తాయి. చంద్రప్రభ వాహనంలో శ్రీవారిని దర్శించడం సకలతాపహరం. పాపహరం.

ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ ధ‌నంజ‌యులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ల‌క్ష్మ‌య్య‌, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీబాలాజీ రంగాచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.