GANDHIAN WAY A ROLE MODEL FOR RIGHTEOUS PATH- TTD CHIEF AUDIT OFFICER _ గాంధీజీ అడుగుజాడల్లో నడవాలి – టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేషశైలేంద్ర

Tirupati, 02 October 2023: Follow the footsteps of great leaders like Mahatma Gandhi who sacrificed their lives for the sake of the country and shown us the righteous path, said TTD Chief Audit Officer Sri Sesha Sailendra.

Mahatma Gandhi Jayanti was celebrated on Monday in the conference hall of the TTD administration building.  First the officers paid floral tributes to Gandhiji’s portrait.

Chief Audit Officer of TTD who was the chief guest of the program, said that a lot of effort has been put in by Mahatma Gandhiji to remove the loopholes in the system in those days.  He informed that through the struggles of salt satyagraha, boycott of foreign goods, clothes etc., the sense of nationalism was instilled among the common people in a peaceful manner by Gandhiji.  In the spirit of Gandhiji, he asked TTD employees to serve the devotees with more dedication and devotion.

Deputy EO Sri Gunabhushan Reddy, Sri Govindarajan and employees of DEO Dr Bhaskar Reddy participated in this program held under the aegis of TTD Welfare Officer Smt. Snehalatha.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గాంధీజీ అడుగుజాడల్లో నడవాలి – టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేషశైలేంద్ర

తిరుపతి, 2023, అక్టోబరు 02: స్వాత్రంత్య్రం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహాత్మా గాంధీ లాంటి నాయకుల అడుగుజాడల్లో అందరూ నడవాలని టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేషశైలేంద్ర కోరారు.

టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేషశైలేంద్ర మాట్లాడుతూ పూర్వం భారతీయ సంస్కృతిలో అన్ని వర్గాల వారికి సంపద సమానంగా దక్కే అవకాశం ఉండేదన్నారు. అలాంటి సంస్కృతిని బ్రిటిష్ వారు తీవ్రంగా ప్రభావితం చేశారని చెప్పారు. సత్యం, అహింస మార్గాల ద్వారా బ్రిటిష్ వారిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్న నాయకుడు గాంధీజీ అన్నారు. వ్యవస్థలో అంతరాలను పోగొట్టేందుకు ఎంతో కృషి చేశారని చెప్పారు. ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, విదేశీ వస్త్ర బహిష్కరణ తదితర పోరాటాల ద్వారా సామాన్యుల్లో జాతీయత భావాన్ని నింపారని తెలియజేశారు. గాంధీజీ స్ఫూర్తితో టీటీడీ ఉద్యోగులు మరింత అంకితభావంతో భక్తులకు సౌకర్యాల కల్పనే పరమావధిగా సేవలందించాలని కోరారు. విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యాజమాన్యానికి అండగా నిలబడడం సంతోషకరమన్నారు. అనంతరం పలువురు అధికారులు, ఉద్యోగులు మాట్లాడుతూ గాంధీ మహాత్ముని సేవలను గుర్తుచేసుకున్నారు.

సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ గోవిందరాజన్, డిఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి ఉద్యోగులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.