TTD CHAIRMAN INSPECTS GALI GOPURAM _ గాలి గోపురం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్

Tirumala, 02 October 2023: TTD Chairman Sri. Bhumana Karunakara Reddy inspected the security arrangements for the devotees coming to Tirumala on the Alipiri footpath on Monday evening at Galigopuram.

He enquired about the security personnel arranged at the front and rear sides of a set of devotees sent upto the Lakshmi Narasimha Swamy temple. 

The Chairman also interacted with the TTD vigilance and security sleuths, Gurkha personnel and directed them to keep the devotees on constant alert. 

He also Karunakara Reddy interacted with the devotees and the shopkeepers.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గాలి గోపురం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్

తిరుమల 2 అక్టోబరు 2023: అలిపిరి నుండి నడక మార్గంలో తిరుమలకు వచ్చే భక్తులకు కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి సోమవారం రాత్రి గాలిగోపురం వద్ద పరిశీలించారు. భక్తులను గుంపులుగా ఏర్పాటుచేసి ముందు, వెనుక సెక్యూరిటీ సిబ్బంది వారిని నరసింహ స్వామి ఆలయం వరకు తీసుకుని వెళుతున్న విధానాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. విజిలెన్స్ , గూర్ఖా, సెక్యూరిటీ సిబ్బందితో చైర్మన్ మాట్లాడారు, భక్తులను నిరంతరం అప్రమత్తం చేస్తూ ఉండాలని ఆదేశించారు. నడచి వెళుతున్న భక్తులతోను, అక్కడి దుకాణ దారులతోను శ్రీ కరుణాకర రెడ్డి మాట్లాడారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది