GANDHIAN WAY INFLUENCED GLOBALLY- JEO _ గాంధీ మార్గం ప్రపంచానికి ఆదర్శం : టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం
TIRUPATI, 02 OCTOBER 2024: The Gandhian way of leading life has a great influence not only in India but across the globe said, TTD JEO Sri Veerabrahmam.
Speaking on the occasion of 155th Jayanti celebrations held at the Conference Hall of TTD Administrative Building on Wednesday in Tirupati he said Satya and Ahimsa – the Truth and non-violence were the two weapons used by Mahatma Gandhiji in his fight against Britishers during the freedom struggle. These reasons made him as Jaati Pita-the Father of the Nation.
DLO Sri Varaprasada Rao, CE Sri Satyanarayana, DyEOs Sri Anandaraju, Sri Gunabhushan Reddy, Smt Shanti, Smt Nagaratna and other officers were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గాంధీ మార్గం ప్రపంచానికి ఆదర్శం : టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం
తిరుపతి, 2024 అక్టోబరు 02: మహాత్మా గాంధీ అనుసరించి చూపిన అహింస మార్గం ప్రపంచానికి ఆదర్శమని టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 155వ జయంతి సందర్భంగా బుధవారం టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో జెఈవో గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా జేఈఓ ప్రసంగిస్తూ, లక్ష్యం ఎంత ముఖ్యమో దాన్ని సాధించేందుకు అనుసరించాల్సిన మార్గం కూడా అంతే ముఖ్యమని గాంధీజీ తెలియజేశారన్నారు. గాంధీజీ మార్గం నేటి యువతకు మార్గదర్శి అని చెప్పారు. అహింసామార్గం ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించిన మహాత్ముడు గాంధీ అన్నారు. దేశప్రజల్లో జాతీయభావాన్ని పెంపొందించి ఒక్కతాటిపై నడిపించారని తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో మానవాళి సత్యం, స్వచ్ఛత, అహింసలను ఆచరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిఎల్ ఓ శ్రీ వరప్రసాదరావు, సిఈ శ్రీ సత్యనారాయణ, డిప్యూటీఈవోలు శ్రీ గుణ భూషణ్ రెడ్డి, శ్రీ ఆనంద రాజు, శ్రీమతి శాంతి, శ్రీమతి నాగరత్నతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.