GANDHIAN WAY OF LIFE IS ALWAYS IDEAL-JEO _ మహాత్ముని మార్గం అనుసరణీయం – గాంధీ జయంతి సమావేశంలో టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి

TIRUPATI, 02 OCTOBER 2021: The path shown by the Father of the Nation, Mohandas Karamchand Gandhi remains ideal to lead a righteous way of life.

The 152 Birth Anniversary of Mahatma Gandhiji was observed by TTD in the meeting hall of TTD Administrative Building at Tirupati on Saturday.

Speaking on the occasion the JEO said “Satyameva Jayate”, “Ahimsa Paramo Dharmaha” were the two principles in which Gandhiji strongly believed and followed till his last breath and hence became Mahatma Gandhi.

Earlier floral tributes were paid to the potrait of Sri Mahatma Gandhi.

All senior officers were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మహాత్ముని మార్గం అనుసరణీయం

– గాంధీ జయంతి సమావేశంలో టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి  2 అక్టోబర్ 20 21: హే రామ్ అంటూ తన చివరి శ్వాస వదిలిన జాతిపిత మహాత్మా గాంధీ గొప్ప హిందూ ధార్మిక వాది అని జెఈవో శ్రీమతి సదా భార్గవి నివాళులర్పించారు.

టిటిడి పరిపాలనా భవనం లోని సమావేశ మందిరంలో శనివారం మహాత్మా గాంధీ 152వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జెఈవో శ్రీమతి సదా భార్గవి తో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు గాంధీ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జెఈవో మాట్లాడుతూ, మహాత్మా గాంధీ కష్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకుని దేశం కోసం పనిచేసిన మహా నాయకుడని ఆమె కొనియాడారు. భావితరాలకు ఆయన మార్గం అనుసరణీయమని చెప్పారు. అర్ధరాత్రి మహిళలు ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని మహాత్ముడు కలలు కన్నారని చెప్పారు. అలాంటి స్వాతంత్రం పూర్తిగా రావడానికి ప్రతి ఒక్కరు మహాత్ముని అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు మౌళిక వసతులు కల్పించి, వారు కూడా చదువుకునే అవకాశం కల్పించిన వ్యక్తి మహాత్ముడని చెప్పారు. స్థానిక పాలనతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఏనాడో చెప్పిన మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్య ఆలోచనే నేడు అమలు జరుగుతోందన్నారు. గాంధీ లోని హిందూ ధార్మిక భావాన్ని టిటిడి ఉద్యోగులు గుర్తు చేసుకుంటూ, నిరంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి నామ జపంతో భక్తుల సేవలో తరించి శ్రీవారి నామాన్ని విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు.

డిప్యూటి ఈవోలు శ్రీ ఆనందరాజు, శ్రీ దామోదరం, ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ విజయ సారధి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్, ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ రవి తో పాటు పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టిటిడి సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది