GLORIFY THE REPUTATION OF YOUR INSTITUTION-FORMER CS AND TTD EO _ వేద విద్యార్థులు సనాతన హైందవ ధర్మానికి సంరక్షకులు- ఏపి మాజీ సిఎస్ శ్రీ ఎల్‌వి సుబ్రహ్మణ్యం
ALONG WITH ADDITIONAL EO PARTICIPATES IN GANESHA NAVARATRI AT DHARMAGIRI
TIRUMALA, 13 SEPTEMBER 2024: The Vedic Students should stand as a role model to others and act as the custodians of the Hindu Sanatana Dharma glorifying the reputation of the institution, asserted former CS of AP and TTD EO Sri LV Subramanyam.
He participated in the Ganesha Navahnikam celebrations held at Dharmagiri Veda Vignana Peetham at Tirumala on Friday along with the Additional EO Sri Ch Venkaiah Chowdhary.
Addressing the students on the occasion he said Dharmagiri happens to be one of the oldest institutions in the country imparting vedic knowledge to hundreds of students. He called upon the students to first have the knowledge about the great history of their educational institution. In the last one and a half centuries this
great centre has produced many stalwarts in the field of vedas. So it is the responsibility of every student to take forward the legacy of this institution.
Earlier in his welcome address TTD Additional EO said apart from imparting vedic education to the students, we are now focussing on improving their physical and mental fitness also. A sports complex is being planned in Tirumala for the students apart from inculcating them Yoga and Meditation also.
He also said henceforth stalwarts from various fields would be invited on a regular basis to enlighten the Vedic students on different topics and personality development which will be useful in building up their future career
Later they participated in the worship of Sri Veera Ganapati Utsavam held in the premises.
Dharmagiri Principal Sri KSS Avadhani, VSO Sri Surendra, Vedic faculty and students, others were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వేద విద్యార్థులు సనాతన హైందవ ధర్మానికి సంరక్షకులు
• ఏపి మాజీ సిఎస్ శ్రీ ఎల్‌వి సుబ్రహ్మణ్యం
• ధర్మగిరిలో గణేశ నవరాత్రులలో పాల్గొన అదనపు ఈవో
తిరుమల, 2024 సెప్టెంబరు 13: వేద విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, సనాతన హిందూ ధర్మ సంరక్షకులుగా వ్యవహరించి సంస్థ ఖ్యాతిని నలు దిశల వ్యాప్తి చేయాలని ఏపి మాజీ సిఎస్, టీటీడీ మాజీ ఈవో శ్రీ ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఉద్ఘాటించారు.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శుక్రవారం జరిగిన గణేశ నవాహ్నిక ఉత్సవాల్లో అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరితో కలిసి ఏపీ మాజీ సిఎస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ ఎల్‌వి సుబ్రహ్మణ్యం విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ, వందలాది మంది విద్యార్థులకు వేద విజ్ఞానాన్ని ప్రసాదిస్తున్న ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం దేశంలోనే పురాతన విద్యాసంస్థల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. విద్యార్థులు తమ విద్యా సంస్థ గొప్ప చరిత్ర గురించి ముందుగా తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గత ఒకటిన్నర శతాబ్దాలలో ఇది గొప్ప విద్యా కేంద్రంగా, వేదాల రంగంలో ఎందరో ప్రముఖులను తయారు చేసిందన్నారు. కాబట్టి ఈ సంస్థ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం ప్రతి విద్యార్థి బాధ్యత అని వివరించారు.
ముందుగా టీటీడీ అదనపు ఈవో స్వాగతోపన్యాసం చేస్తూ, విద్యార్థులకు వేద విద్యను అందించడమే కాకుండా వారి శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నామన్నారు. తిరుమలలో విద్యార్థులకు యోగా, ధ్యానంతో పాటు క్రీడా సముదాయమును కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వేద విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు, వారి భవిష్యత్ ను నిర్మించుకోవడానికి, వారి వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగ పడేలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులచే ఇకపై తరచు ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు .
అనంతరం ఆవరణలో జరిగిన శ్రీ వీర గణపతి ఉత్సవ పూజల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మగిరి ప్రిన్సిపాల్ శ్రీ కేఎస్‌ఎస్ అవధాని, విఎస్‌వో శ్రీ సురేంద్ర, వేద అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.