జనవరి 11, 12వ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో గోపూజకు ఏర్పాట్లు పూర్తి

జనవరి 11, 12వ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో గోపూజకు ఏర్పాట్లు పూర్తి

జనవరి 10, తిరుపతి 2019: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో జనవరి 11, 12వ తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

హిందూ సనాతన ధర్మంలో గోవుకు విశేష ప్రాధాన్యముంది. గోవు ప్రాశస్త్యాన్ని భక్తులందరికీ తెలియజేసేందుకు జనవరి 11న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపికచేసిన 230 ఆలయాలు, జనవరి 12న 23 జిల్లా కేంద్రాల్లో గోపూజ నిర్వహించనున్నారు. అదేవిధంగా, జనవరి 12న తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్ర కేంద్రాల్లో గోపూజ నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.