GO MAHA SAMMELAN AT TIRUPATI ON OCTOBER 30 AND 31 _ అక్టోబ‌రు 30, 31వ తేదీల్లో తిరుప‌తిలో గో మ‌హా స‌మ్మేళ‌నం

FOCUS ON GO BASED FARMING AND ORGANIC PRODUCTS- TTD

 

Tirumala, 09 October 2021: With the objective to herald the basic tenets of Go Rakshane-Dharma Rakshana, TTD will be organising a two day Go Maha sammelan at Tarakarama Stadium in Tirupati on October 30 and 31, said TTD EO Dr KS Jawahar Reddy.

 

After a review meeting with officials of Yuga Tulasi foundation and Sri Godham Maha Thirtha PathMeda at Annamaiah Bhavan on Saturday evening, the TTD EO said TTD had launched several programs for Gosamrakshana with the motto Goseva -ye- Govinduni seva.

 

On the first day of Sammelan the farmers from all districts of AP will be given an awareness display on Go based products and briefing on Go based agricultural methods.

 

TTD EO said on the second day there would be discourses by pontiffs of 22 mutts including Sri Sri Sri Shankara Vijayendra Saraswati Swamy, of Kanchi, Gaurushi Swamy, Sri Dutt Sharananda Maharaj of Rajasthan PathMeda, Sri Sri Sri Vidya Prasanna Swamy of Udupi and many. They enlighten on the need to protect cows to meet the demands of future generations.

 

In total adherence to Covid guidelines, daily 1000 farmers will participate in this unique and noble farmers’ convention.

 

Additional EO Sri AV Dharma Reddy, JEO Sri Veerabrahmam, Yuga Tulasi Foundation Chairman and TTD board former member Sri Shiva Kumar, VGOs Sri Bali Reddy, Sri Manohar and other officials were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 30, 31వ తేదీల్లో తిరుప‌తిలో గో మ‌హా స‌మ్మేళ‌నం

– గో ఆధారాత వ్య‌వ‌సాయం, ఉత్ప‌త్తుల వినియోగం పెంచ‌డమే ల‌క్ష్యం

– టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుమ‌ల‌, 2021 అక్టోబ‌రు 09: ” గో ర‌క్ష‌ణే ధ‌ర్మ‌ర‌క్ష‌ణ ” అనే మౌలిక అంశాన్ని స‌మాజంలోనికి తీసుకు వెళ్ళ‌డానికి అక్టోబ‌రు 30, 31వ తేదీల్లో తిరుప‌తిలోని తార‌క‌రామ స్టేడియంలో ” గో మ‌హా స‌మ్మేళ‌నం ” కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం సాయంత్రం యుగ తుల‌సి ఫౌండేష‌న్ మ‌రియు శ్రీ గోధాం మ‌హాతీర్ద్, ప‌త్ మేడ వారితో స‌మావేశం నిర్వ‌హించారు.

” గోసేవే గోవిందుడి సేవ ” అనే నినాదంతో ధ‌ర్మానికి ప్ర‌తి రూప‌మైన గో సంర‌క్ష‌ణ‌కు టిటిడి అనేక కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టి విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఇందులో మొద‌టి రోజు వివిధ జిల్లాల నుండి వ‌చ్చే రైతుల‌తో గో ఉత్ప‌త్తుల‌తో ప్ర‌ద‌ర్శ‌న, రైతుల‌కు గో ఆధారిత వ్య‌వ‌సాయంపై అవ‌గాన‌ క‌ల్పించ‌నున్న‌ట్లు చెప్పారు. రెండ‌వ రోజు కంచి శ్రీ‌శ్రీ‌శ్రీ శంక‌ర విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామిజీ, రాజ‌స్థాన్ ప‌త్ మేడ‌కు చెందిన గౌరుషి స్వామి శ్రీ ద‌త్ శ‌ర‌ణానంద్ మ‌హారాజ్‌, ఉడిపి శ్రీ‌శ్రీ‌శ్రీ విద్యా ప్ర‌స‌న్న స్వామిజీ వంటి 22 మంది దేశంలోని ప్ర‌ముఖ మ‌ఠాదిప‌తులు, పీఠాదిప‌తులు భ‌విష్య‌త్ త‌రాల‌కు గోవును ఎలా కాపాడుకోవాల‌నే అంశంపై అనుగ్ర‌హ భాష‌ణం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు.

ఈ స‌మ్మేళ‌నంలో కోవిడ్ – 19 నిబంధ‌న‌లు పాటిస్తూ మొద‌టి రోజు వెయ్యి మంది, రెండ‌వ రోజు వెయ్యి మంది రైతులు పాల్గొనేలా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. మ‌రోసారి ఈ స‌మ్మేళనంపై స‌మీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఈవో తెలిపారు.

ఈ స‌మావేశంలో అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈఓ శ్రీ వీర‌బ్ర‌హ్మం, యుగ తుల‌సి ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ మ‌రియు టిటిడి బోర్డు మాజీ స‌భ్యులు శ్రీ శివ‌కుమార్‌, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ మ‌నోహ‌ర్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.