తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గోపూజ

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గోపూజ

జనవరి 11, తిరుపతి 2019: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో గోపూజ ఘనంగా జరిగింది. ధర్మప్రచారంలో భాగంగా సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాలో 10 ఎంపికచేసిన ఆలయాల్లో గోపూజ కార్యక్రమాన్ని చేపట్టారు.

సకల దేవతాస్వరూపమైన గోవు హిందువులకు ఆరాధ్యదేవత. పుణ్యనదీనదాలన్నీ గోవులో మూర్తీభవించి ఉన్నాయి. గోవు పుణ్యానికి నిలయం. ఈ కారణంగానే గోపూజను ఎంతో పవిత్రంగా భావిస్తారు.

కాగా, జనవరి 12న ఉభయ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్ర రాజధానుల్లోనూ గోపూజ మహోత్సవం నిర్వహించనున్నారు. భక్తులందరూ ఈ పవిత్రమైన పుణ్యకార్యక్రమంలో పాల్గొనాలని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా.. రమణప్రసాద్‌ కోరారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.