MAHA KUMBHABHISHEKAM IN KANYA KUMARI TEMPLE ON JAN 27_ జనవరి 27న కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ

Tirupati, 10 Jan. 19: Sri Venkateswara Swamy temple which was constructed in Kanyakumari is all set for a grand opening on January 27 by TTD.

The five day opening event will take place with Purnahuti on first four days starting from January 23 and Maha Purnahuti on January 27 with Ankurarpanam on January 22.

Maha Samprokshanam for the event is files betalen 7.30am and 9am in kumuha nagnam on January 27.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జనవరి 27న కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ

జనవరి 11, తిరుపతి 2019: తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కన్యాకుమారిలో టిటిడి నిర్మించిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జనవరి 27న ఉదయం 7.30 నుండి 9 గంటల నడుమ కుంభ లగ్నంలో మహాసంప్రోక్షణ ఘనంగా జరుగనుంది. జనవరి 23 నుండి 27వ తేదీ వరకు శ్రీవారి విగ్రహప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకోసం జనవరి 22వ తేదీన అంకురార్పణ జరుగనుంది.

జనవరి 22న సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు ఆచార్య రుత్విక్‌వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, వేదారంభం చేపడతారు.

జనవరి 23న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగశాల వాస్తు, పంచగవ్య ప్రసన్నం, రక్షాబంధనం, అకల్మష ప్రాయశ్చిత్తహోమం, అక్షిన్మోచనం, పంచగవ్య అధివశం, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అగ్నిప్రతిష్ఠ, కుంభావాహనం, కుంభారాధన, హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు.

జనవరి 24న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు హోమం, క్షీరాధివాసం, పూర్ణాహుతి, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు హోమం, పూర్ణాహుతి చేపడతారు.

జనవరి 25న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు హోమం, జలాధివాసం, పూర్ణాహుతి, మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు బింబస్థాపనం, సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు.

జనవరి 26న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బింబవాస్తు, నవకలశ స్నపనం, చతుర్దశ కలశస్నపనం, హోమం, పూర్ణాహుతి, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు మహాశాంతి తిరుమంజనం, మహాశాంతి పూర్ణాహుతి, రాత్రి 8 నుండి 10 గంటల వరకు రక్షాబంధనం, కుంభారాధనం, నివేదనం, శయనాధివాసం, హౌత్రం, సర్వదేవతార్చన, హోమం చేపడతారు.

జనవరి 27వ తేదీన ఉదయం 4 నుండి 7 గంటల వరకు సుప్రభాతం, కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి, ఉదయం 7 నుండి 7.30 గంటల వరకు కుంభాలను, ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆయా సన్నిధుల్లోకి వేంచేపు చేస్తారు. ఉదయం 7.30 నుండి 9 గంటల నడుమ కుంభ లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.

ఆ తరువాత ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు బ్రహ్మఘోష, వేదశాత్తుమొర, ధ్వజారోహణం, అర్చక బహుమానం, ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిత్యకైంకర్యాల అనంతరం సాయంత్రం 6.30 గంటల వరకు సర్వదర్శనం, సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు కల్యాణోత్సవం, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు, ధ్వజావరోహణం, సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు సర్వదర్శనం, రాత్రి 8.45 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.