GODA KALYANAM HELD WITH RELIGIOUS FERVOUR _ కన్నుల పండువగా గోదా కల్యాణం

TIRUPATI, 15 JANUARY 2023: The spiritual event mulled by TTD, Sri Goda Kalyanam was held with utmost religious fervour in the Parade Grounds of the TTD Administrative Building in Tirupati on Sunday evening.

The programme commenced with a dance ballet on Goda Kalyanam in a colour and splendid manner by the students of TTD-run SV College of Music and Dance.

Annamacharya Project Director Dr Vibhishana Sharma explained every episode of the celestial event. The whole celestial marriage was carried out by the Archakas under the supervision of one of the Chief Priests of Tirumala temple Sri Krishna Seshachala Deekshitulu.

After Viswaksena Pooja, Punyahavachanam, Ankurarpanam, Raksha Bandhanam, Agni Pratista, Sankalpam, Nivedanam, Vastra Samarpana, Maha Sankalpam, Mangalya Pooja and Dharana, Pradhana Homam, Laja Homam, Purnahuti were performed.

Later Varana Mayiram, Mala Parivarthanam, Akshataropanan and finally Mangala Harati rendered.

During every episode of the event melodious presentation of Annamacharya Sankeertans were rendered by the Project artistes which immersed the devotees in devotional waves.

The celestial event concluded with Govinda Namams.

The entire program was telecasted live on SVBC for the sake of global programs by TTD.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, Deputy EO Sri Devendra Babu, SV College of Music and Dance Principal Sri Sudhakar, VGOs Sri Manohar, Sri Bali Reddy, Tirumala temple Parupattedar Sri Uma Maheswara Reddy, Estates Wing OSD Sri Mallikharjuna and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కన్నుల పండువగా గోదా కల్యాణం

తిరుపతి, 15 జనవరి 2023: టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో గల మైదానంలో ఆదివారం రాత్రి కన్నుల పండువగా గోదా కల్యాణం జరిగింది.

ముందుగా శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు కల్యాణ వేదిక మీద వేంచేపు చేశారు. ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన గోదా కల్యాణం నృత్యరూపకం ఆద్యంతం అలరించింది.

అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవింద గోవిందయని కొలువరే సంకీర్తన ఆలపించారు. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీవిష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణం, రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. సర్కారు సంకల్పం, భక్తుల సంకల్పం, మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. ఆతరువాత మహా సంకల్పం, స్వామి,అమ్మవార్ల ప్రవరలు, మాంగల్యపూజ, మాంగల్య ధారణ కార్యక్రమాలు వేడుకగా నిర్వహించారు. అనంతరం ప్రధాన హోమము, లాజ హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. వారణమాయిరం, మాలా పరివర్తనం, అక్షతారోపణం జరిపి చివరగా నివేదన, మంగళ హారతులు నిర్వహించారు. గోవింద నామ సంకీర్తనలతో గోదా కల్యాణం కార్యక్రమం ముగిసింది.

అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ కార్యక్రమం వ్యాఖ్యాతగా వ్యవహరించి గోదా కల్యాణం విశిష్టతను వివరించారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పలు సంకీర్తనలు వీనుల విందుగా ఆలపించారు.

జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈఓ శ్రీ షణ్ముఖ్ కుమార్, విజివో శ్రీ మనోహర్, ఎస్టేట్ ఒఎస్డీ శ్రీ మల్లిఖార్జున , తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కృష్ణ శేషాచల దీక్షితులు, ఎస్వీ సంగీతనృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సుధాకర్, డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు , శ్రీవారి ఆలయ పారుపత్తేదారు శ్రీ ఉమామహేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.