GODDESS OF RICHES DONS THE AVATAR OF GODDESS OF WISDOM_ హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరుల‌త‌ల్లి

Tiruchanoor, 5 Dec. 18: Sri Padmavathi Devi on Wednesday evening blessed devotees in Saraswathi Devi Alankaram on Hamsa Vahanam.

In Hinduism, Saraswathi Devi worshipped and revered as Goddess of Wisdom. Her favourite carrier is the divine swan. This charming is often considered to be Parama Hamsa Swarupa since it has the peculiar quality and capacity to separate water from milk.

By riding this vehicle, the Goddess throws the message that inspite of all wealth, the one who has the wealth of wisdom will prosper forever.

TTD EO Sri AK Singhal, Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jatti, ACVSO Sri Sivakumar Reddy, Dy.EO Smt Jhansi Rani and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరుల‌త‌ల్లి

తిరుప‌తి, 2018 డిసెంబ‌రు 05: తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి కార్తీక బ్రహ్మోత్సవాల రెండో రోజు రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు సరస్వతి అలంకారంలో హంస వాహ‌నంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. రాత్రి 8 నుండి 11 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

భారతీయ సంస్కృతిలో అనాదిగా మహావిజ్ఞాన సంపన్నులైన మహాత్ములను, యోగిపుంగవులను ”పరమహంస”లుగా పేర్కొనడం సంప్రదాయం. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాల‌ను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అట్టి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ”హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ” అని ఆ తల్లిని ఆరాధిస్తారు.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, టిటిడి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఏవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర్ ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.