GOKULASHTAMI CELEBRATED IN TTD TEMPLES _ కపిలతీర్థంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో వేడుకగా గోకులాష్టమి

Tirupati, 07 September 2023: The festival of Gokulashtami was celebrated with religious fervour in all TTD temples on Thursday.

As part of it at the Sri Venugopalaswamy temple attached to Sri Kapileswara Swamy temple in the morning, Abhishekam was performed to the presiding deity of Sri Venugopalaswami.  A street festival was held in the evening.  After that Gokulashtami Asthanam was held.

Temple Deputy EO Shri Devendra Babu, Superintendent Sri Bhupathi, Temple Inspectors Sri Ravikumar and Sri Balakrishna participated in this program.

Similarly, special pujas were conducted for Sri Venugopalaswami along with Rukmini Satyabhama in Karvetinagaram and Sri Venugopalaswamy in Chandragiri Sri Kodandaramalayam.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కపిలతీర్థంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో వేడుకగా గోకులాష్టమి

తిరుపతి, సెప్టెంబరు 07, 2023: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో గురువారం గోకులాష్టమి ఘనంగా జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం శ్రీ వేణుగోపాలస్వామివారి మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం వీధి ఉత్స‌వం చేపట్టారు. ఆ తరువాత స్వామివారికి గోకులాష్టమి ఆస్థానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈవో శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్సెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ పాల్గొన్నారు.

అదేవిధంగా, కార్వేటినగరంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారికి, చంద్రగిరి శ్రీ కోదండరామాలయంలోని శ్రీ వేణుగోపాలస్వామివారికి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.