GOKULASTAMI FETE ON SEP 3_ తిరుమలలో సెప్టెంబరు 3న శ్రీకృష్ణ జన్మాష్టమి, 4న ఉట్లోత్సవం

Tirumala, 29 August 2018: The Gokulastami Asthanam will be performed in Bangaru Vakili of Tirumala temple on September 3 between 8pm and 10pm.

On the same day, special Abhishekam will be performed to Kaliya Mardhana Krishna located in Gogarbham Gadens between 11pm and 12noon by Garden wing of TTD.

Later on September 4, Utlotsvam will be observed from 4pm to 8pm. TTD has cancelled all evening arjitha sevas in connection with this fete on Tuesday.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో సెప్టెంబరు 3న శ్రీకృష్ణ జన్మాష్టమి, 4న ఉట్లోత్సవం

తిరుమల, 2018 ఆగస్టు 29: కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామియే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన, ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా సంస్మరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత సెప్టెంబరు 3వ తేది రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల నడుమ గోకులాష్టమి ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా గోగర్భం డ్యామ్‌ చెంత వెలసియున్న ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణుడుకి ఉ.11.00 గంటలకు పంచాభిషేకాలను ఘనంగా నిర్వహించనున్నారు. అభిషేకానంతరం ఇదే ప్రాంగణంలో మధ్యాహ్నం 12.00 గంటలకు ఉట్లోత్సవాన్ని కూడా నిర్వహించనున్నారు. అటుతరువాత ప్రసాద వితరణ కార్యక్రమం జరుగనుంది.

కాగా సెప్టెంబరు 4న తిరుమలలో ఉట్లోత్సవాన్ని సాయంత్రం 4.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ తిలకిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహముతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు.

ఈ ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబరు 4వ తేదిన ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ వేడుకల్లో టిటిడి ఉన్నతాధికారులు ఉత్సాహంగా పాల్గొంటారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.