GOVERNOR COMPLIMENTS THE V- DAY ARRANGEMENTS BY TTD_ వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్ల‌ను ప్ర‌శంసించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఉప్మా రుచి భేషుగ్గా ఉంద‌న్న గ‌వ‌ర్న‌ర్‌

Tirumala, 17 Dec. 18: The honourable Governor of twin Telugu states Sri ESL Narasimhan on Monday inspected the arrangements made by TTD for the sake of multitude of devotees who are coming to Tirumala for Vaikuntha Dwara Darshanam.

He inspected Narayanagiri queue lines where TTD has constructed sheds with Anna prasadam, drinking water and toilet facilities. He even tasted upma which was serveste to devotees waiting in sheds and interacted with them. Pilgrims expressed their immense satisfaction over the arrangements by TTD.

Later speaking to media persons, the Governor said, TTD has made elaborate arrangements feeling in view the huge turnout of pilgrims that is being anticipated.

“I appeal to all pilgrims to remain with patience till their turn for darshanam and co operate with TTD so that everyone will have vaikuntha dwara darshanam. The officials of TTD have made excellent arrangements to shield the pilgrims from inclement weather conditions by constructing sheds in Narayanagiri Gardens and Mada streets”, he maintained.

CVSO Sri Gopinath Jetti, ACVSO Sri Siva kumar Reddy, temple DyEO Sri Harindranath and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్ల‌ను ప్ర‌శంసించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఉప్మా రుచి భేషుగ్గా ఉంద‌న్న గ‌వ‌ర్న‌ర్‌

డిసెంబ‌రు 17, తిరుమల 2018: వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి సంద‌ర్భంగా తిరుమ‌ల‌కు విశేషంగా వ‌స్తున్న‌ భ‌క్తుల కోసం టిటిడి చేప‌ట్టిన ఏర్పాట్లు బాగున్నాయ‌ని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్ ప్ర‌శంసించారు. సోమ‌వారం ఉద‌యం శ్రీవారి ద‌ర్శ‌నానంత‌రం వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్ల‌ను గ‌వ‌ర్న‌ర్ ప‌రిశీలించారు. నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో భ‌క్తుల‌కు పంపిణీ చేస్తున్న ఉప్మాను రుచి చూసి భేషుగ్గా ఉంద‌ని అభినందించారు.

నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, మ‌రుగుదొడ్ల వ‌స‌తి క‌ల్పిస్తూ ఏర్పాటుచేసిన షెడ్ల‌ను గౌ|| గవర్నర్ ప‌రిశీలించారు. అక్క‌డ వేచి ఉన్న భ‌క్తుల‌కు విత‌ర‌ణ చేస్తున్న ఉప్మాను రుచి చూసి వారితో ముచ్చ‌టించారు. టిటిడి ఏర్పాట్ల‌పై భ‌క్తులు పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా గౌ|| గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం పెద్ద సంఖ్య‌లో వ‌స్తున్న భ‌క్తులకు టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టింద‌న్నారు. షెడ్ల‌లో వేచి ఉన్న భ‌క్తుల‌కు త‌ప్ప‌కుండా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ల‌భిస్తుంద‌ని, త‌మ వంతు వ‌చ్చే వ‌ర‌కు భ‌క్తులు ఓర్పుతో ఉండి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. భ‌క్తులు ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో ఇబ్బందులు ప‌డ‌కుండా నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాలు, మాడ వీధుల్లో షెడ్ల‌తోపాటు టిటిడి అద్భుత‌మైన ఏర్పాట్లు చేప‌ట్టింద‌న్నారు.

గౌ|| గ‌వ‌ర్న‌ర్ వెంట టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అద‌న‌పు సివిఎస్‌వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటి ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్ ఇత‌ర అధికారులు ఉన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.