GRAND TTD INTERNATIONAL WOMEN’S DAY CELEBRATIONS IN MAHATHI _ మహిళలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలి : తిరుప‌తి మేయ‌ర్ డా|| శిరీష‌

15 TTD WOMEN EMPLOYEES HONOURED WITH SRI PADMAVATI AWARDS

WOMEN ALONE CAN BUILD A NEW SOCIETY: TTD JEO (H & E)

–       WOMEN SHOULD PLAY KEY ROLES IN ALL FIELDS: TMC MAYOR

–       WOMEN TAKE FIRST LEAP STEP FOR CHANGE: TTD BOARD MEMBER SRI P ASHOK KUMAR

 CULTURAL PROGRAMMES ALLURE PARTICIPANTS

Tirupati, 08 March 2022: The International Women’s Day held by TTD in Mahati Auditorium on Tuesday witnessed the great union of women stalwarts in various fields from the temple city of Tirupati.

During their extempore speeches, TMC mayor Dr Shirisha, TTD JEO (H &E) smt Sada Bhargavi exhorted women to play a decisive role in all sectors and excel with their inborn skills.

Participating in the TTD organised International Women’s Day celebrations at Mahati Auditorium as Chief Guest, the first-ever Mayor for TMC who is also a Gynaecologist by Profession Dr R Sireesha said it is the women who got the capacity to sustain the human race in the world and it is the bounded duty of every citizen to safeguard and respect women. She said the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy had given priority to women to excel in key posts.

TTD Trust board member Sri P Ashok Kumar said women with education and equal rights had achieved extraordinary results and India had witnessed 16 women Chief Ministers who made laudable contributions towards the development of their respective states.

TTD JEO Smt Sada Bhargavi said in Hindu Dharma, the deities whom we offer prayers every day have given a prominent place to their spouse like Brahma on His tongue, Sri Maha Vishnu in his bosom, Maha Siva in half of His body and highlighted the importance of women.

She said unhappiness, diseases, wars etc. prevailed wherever women are insulted and assaulted but wealth and peace wherever they are honoured.

Tirupati urban Additional SP Smt Supraja said girl child be nurtured to face all difficult situations bravely and also extolled the Nirbhaya act.

SV Zoo Curator and Deputy Conservator of Forest Smt Hima Shailaja said women enshrined as Goddesses in Hindu society and even Adi Shankaracharya had mentioned about the significance of women in his popular work Soundarya Lahiri.

SV University Dean Dr Savitramma and International athlete Smt Soujanya who had 250 National and international medals to her credit also spoke on the occasion.

FELICITATIONS TO DIGNITARIES

The Welfare Wing of TTD which has organised the program also felicitated all the dignitaries.

15 TTD employees were given Sri Padmavati awards.

As part of the International Women’s Day celebrations, 15 women employees belonging to various departments of TTD in different cadres were presented with the prestigious Sri Padmavati awards for their meritorious services in the organisation.

CULTURAL PROGRAMMES ENTHRALL

The series of cultural programmes performed by the women employees of TTD enthralled the audience and the Mahati platform brought out their inbuilt talents on to the fore.

The skit on the Disha incident, Lava-Kusa act, Modern Mother-in-Law and countryside Daughter-in-Law, fancy dress, songs rendered by the employees made everyone spellbound.

All the departments of TTD made elaborate arrangements for the Women’s festival.

TTD welfare DyEO Sri Damodaram and his team of staffs worked day and night to make the function a grand success.  TTD APRO Ms. P. Neelima and Dr V Krishnaveni, Head of Telugu department in SPW Degree College were anchors of the event. 

Spl Gr. DyEOs Smt Varalakshmi, all DyEOs, College Principals, CMO InCharge Dr Narmada, women doctors from TTD, Ayurvedic College and women employees were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మహిళలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలి : తిరుప‌తి మేయ‌ర్ డా|| శిరీష‌

మార్పు కోసం ముందడుగు వేయండి : బోర్డు స‌భ్యులు శ్రీ పోక‌ల అశోక్ కుమార్‌

మ‌హిళ‌లు మాత్ర‌మే న‌వ స‌మాజ నిర్మాత‌లు : జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

విశేష సేవ‌లందించిన 15 మంది మ‌హిళా ఉద్యోగుల‌కు శ్రీ ప‌ద్మావ‌తి అవార్డులు

తిరుపతి, 2022 మార్చి 08: మ‌హిళ‌లు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని, ఏ రంగంలోనైనా నిర్ణయాత్మక పాత్ర పోషించాలని తిరుప‌తి మేయ‌ర్ డా|| శిరీష పిలుపునిచ్చారు. టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో మంగ‌ళ‌వారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేయ‌ర్ డా|| శిరీష ప్రసంగిస్తూ భార‌తీయ నాగ‌రిక‌త మొద‌లైన‌ప్ప‌టి నుండి మ‌హిళ‌ల‌కే పెద్ద‌పీట వేశార‌ని, సృష్టికి మూలం స్త్రీ అని, కుటుంబాన్ని ముందుండి న‌డ‌ప‌గ‌ల శ‌క్తి మాతృమూర్తి సొంత‌మని పేర్కొన్నారు. విద్య‌తోనే మ‌హిళా సాధికార‌త సాధ్య‌మ‌న్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్ని రంగాల‌లో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నార‌ని చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హిళా సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తోంద‌ని, మహిళలకు పెద్దపీట వేయడం వల్లే దేశం అభివృద్ధి సాధిస్తోందని వివ‌రించారు.

టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ పోక‌ల అశోక్ కుమార్ మాట్లాడుతూ వేదాల నుంచి ఉద్భవించిన సనాతన ధర్మంలో మహిళకు పూజనీయ స్థానం ఉందని, స్త్రీని దేవ‌త‌గా పూజించ‌డం ఇక్క‌డ మాత్ర‌మే ఉంద‌న్నారు. మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబం, సమాజం అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. మహిళలు జ్ఞానాన్ని అలవరచుకుని స్త్రీ పురుష సమానత్వాన్ని చాటాలన్నారు. సమాన అవకాశాలు కల్పించడం ద్వారా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించగలరన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 16 మంది మ‌హిళా ముఖ్యమంత్రులు ప్ర‌జ‌ల‌కు విశేష సేవ‌లందించార‌ని వివ‌రించారు.

జెఈవో శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి మాట్లాడుతూ ఆకాశమంత చైతన్యం మహిళ సొంతమన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామివారు తన వక్షస్థలంలో, బ్రహ్మ తన నాలుకపై, శివుడు తన తలపై దేవేరులకు స్థానం కల్పించారని, దీనిని బట్టి మహిళలకు ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకోవచ్చని అన్నారు. ఉన్నతమైన భారతీయ సంస్కృతిని విదేశీయులు సైతం పాటించేందుకు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. భారతీయ మహిళ ఎంత ఎత్తుకు ఎదిగినా కట్టు, బొట్టును మరిచిపోదని, ప్ర‌కృతి – ప‌రిపూర్ణ‌త అంటే స్త్రీ అని తెలిపారు. స్త్రీ ఎక్క‌డైతే అవ‌మానించి, హింసింపబ‌డుతుందో అక్క‌డ అశాంతి, యుద్ధాలు జ‌రుగుతాయ‌ని, ఎక్క‌డ పూజింప‌బ‌డుతుందో అక్క‌డ సుఖ‌శాంతులు, సిరిసంప‌ద‌లు వ‌ర్థిలుతాయ‌ని వివ‌రించారు.

తిరుప‌తి అర్భ‌న్ అద‌న‌పు ఎస్పీ శ్రీ‌మ‌తి సుప్ర‌జ మాట్లాడుతూ కుటుంబాల్లో బాలిక‌ల‌ను ధైర్యసాహ‌సాల‌తో పెంచాల‌ని, ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను చాక‌చ‌క్యంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దాల‌ని సూచించారు. నిర్భ‌య చ‌ట్టం, మ‌హిళా చ‌ట్ట‌లను గురించి తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌ను వినియోగించుకోవాల‌న్నారు.

ఎస్వీ జూ క్యూరేట‌ర్ శ్రీ‌మ‌తి హిమశైల‌జ మాట్లాడుతూ వేదాల్లో స్త్రీని శ‌క్తి స్వ‌రుపంగా, దేవ‌త‌ల్లో శ్రీ స‌ర‌స్వ‌తి, శ్రీ ల‌క్ష్మీదేవి, శ్రీ ఆదిప‌రాశ‌క్తి, వేద కాలంలో మైత్రేయి, గార్గేయి, పురాణాల్లో సీత లాంటి మ‌హిళామూర్తులు ఉన్నార‌ని తెలియ‌జేశారు. ఆదిశంక‌రాచార్యులు ర‌చించిన సౌంద‌ర్య‌ల‌హ‌రి సంకీర్త‌న‌లో మ‌హిళ గొప్ప‌ద‌నం తెలుస్తుంద‌న్నారు. ప్ర‌కృతి – స్త్రీ సంబంధాన్ని వివ‌రించారు.

ఎస్వీ విశ్వ‌విద్యాల‌యం డీన్ డా|| సావిత్ర‌మ్మ ప్ర‌సంగిస్తూ భార‌తీయ సంస్కృతి సాంప్ర‌దాయాలు కాపాడ‌వ‌ల‌సిన బాధ్య‌త ప్ర‌తి మ‌హిళ‌పై ఉంద‌న్నారు. మ‌హిళ‌ల అభ్యున్న‌తి వెనుక పురుషుల కృషి కూడా ఉంద‌న్నారు.

అంత‌ర్జాతీయ అథ్లెట్ శ్రీ‌మ‌తి సౌజ‌న్య‌ మాట్లాడుతూ మ‌న‌ల్ని మ‌నం ప్రోత్స‌హించుకుంటూ ముందుకు సాగితే విజ‌యం త‌ప్ప‌క వ‌రిస్తుంద‌ని, త‌ద్వారా ఇత‌రుల‌కు స్ఫూర్తిదాయ‌కంగా నిల‌వాల‌ని కోరారు. ఆమె 14వ సంత్స‌రం నుండి క్లిష్ట ప‌రిస్థితుల్లో అంత‌ర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగిన తీరును వివ‌రించారు.ఇప్ప‌టివ‌ర‌కు 250కి పైగా ప‌త‌కాలు సాధించిన‌ట్లు చెప్పారు.

అతిథులకు సన్మానం :

అతిథులుగా విచ్చేసిన తిరుప‌తి మేయ‌ర్ డా|| శిరీష‌, టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ పోక‌ల అశోక్ కుమార్‌, ఎస్వీ జూ క్యూరేట‌ర్ శ్రీ‌మ‌తి హిమశైల‌జ, ఎస్వీ విశ్వ‌విద్యాల‌యం డీన్ డా|| సావిత్ర‌మ్మ, అంత‌ర్జాతీయ అథ్లెట్ శ్రీ‌మ‌తి సౌజ‌న్య‌ను జెఈవో జ్ఞాపిక, శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు.

15 మంది మ‌హిళా ఉద్యోగుల‌కు శ్రీ ప‌ద్మావ‌తి అవార్డులు

విధి నిర్వ‌హ‌ణ‌లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన 15 మంది మ‌హిళా ఉద్యోగుల‌కు మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అవార్డులు ప్ర‌దానం చేశారు.

వీరిలో శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పిజి క‌ళాశాల ప్రిన్సిపాల్ డా. మ‌హ‌దేవ‌మ్మ, అశ్విని ఆసుప‌త్రి సూప‌రిండెంట్ డా.కుసుమ‌కుమారి, ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల లెక్చ‌ర‌ర్ శ్రీ‌మ‌తి సురేఖ‌, ఎస్పీ డ‌బ్ల్యు పాలిటెక్నిక్ క‌ళాశాల లెక్చ‌ర‌ర్ శ్రీ‌మ‌తి స‌ర‌స్వ‌తి, డెప్యూటీ ఇఇ శ్రీ‌మ‌తి ల‌క్ష్మీదేవి, ఏఇఇ శ్రీ‌మ‌తి గౌరి పుష్ప‌ల‌త‌, ప్ర‌చుర‌ణ‌ల విక్ర‌య విభాగం సూప‌రిండెంట్ శ్రీ‌మ‌తి నిర్మ‌ల, కేంద్రీయ వైద్య‌శాల ఫార్మ‌సీ సూప‌ర్‌వైజ‌ర్ శ్రీ‌మ‌తి ప‌ద్మ‌జ రాణి, స్టాఫ్ న‌ర్స్ శ్రీ‌మ‌తి స‌ర‌స్వ‌తి, అడిట్ కార్యాల‌యం సీనియ‌ర్ అసిస్టెంట్ శ్రీ‌మ‌తి గీత‌, డిఈవో కార్యాల‌యం స్టెనో శ్రీ‌మ‌తి సావిత్ర‌మ్మ‌, ఎస్పీ బాలిక‌ల పాఠ‌శాల అసిస్టెంట్ శ్రీ‌మ‌తి నాగ‌రాజ‌మ్మ‌, ఎస్టేట్‌ విభాగం డెప్యూటీ స‌ర్వేయ‌ర్ శ్రీ‌మ‌తి నాగ‌ర‌త్న‌మ్మ‌, ఎస్వీ హైస్కూల్ ఒఎస్ఒ శ్రీ‌మ‌తి స‌ర‌స్వ‌త‌మ్మ‌, ప్ర‌చుర‌ణ‌ల విభాగం స్వీప‌ర్ శ్రీ‌మ‌తి ర‌వ‌ణ‌మ్మ ఉన్నారు. వీరికి 5 గ్రాముల వెండి డాల‌ర్‌తోపాటు శాలువ‌, జ్ఞాపిక‌, శ్రీ‌వారి ప్ర‌సాదం అందించారు.

టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ దామోద‌రం వందన సమర్పణ చేశారు. టిటిడి సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, ఎస్‌పిడబ్ల్యు డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా|| వి.కృష్ణవేణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, శ్రీ‌మ‌తి నాగ‌ర‌త్న, శ్రీ‌మ‌తి శాంతి, శ్రీ‌మ‌తి స్నేహ‌ల‌త‌, ఇతర మహిళా ఆధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

విజేతల‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టిటిడి మహిళా ఉద్యోగుల కు నిర్వహించిన వివిధ పోటీల్లో వినేతలకు బహుమతి ప్రదానం చేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు మంగ‌ళ‌వారం తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. ఈ సంద‌ర్భంగా విజేతలకు బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు.

చిత్ర‌లేఖ‌నం పోటీల్లో ఎపిఆర్వో కుమారి పి.నీలిమ ప్ర‌థ‌మ‌, న‌ర్స్‌ శ్రీ‌మ‌తి భానుప్రియ ద్వితీయ‌, హెల్ప‌ర్‌ శ్రీ‌మ‌తి లావ‌ణ్య‌ తృతీయ బ‌హుమ‌తులు సాధించారు.

వ్యాస‌ర‌చ‌న పోటీల్లో సీనియ‌ర్ అసిస్టెంట్ శ్రీ‌మ‌తి వ‌సంత‌ ప్ర‌థ‌మ‌, సీనియ‌ర్ అసిస్టెంట్‌ శ్రీ‌మ‌తి సౌజ‌న్య‌ ద్వితీయ‌, సీనియ‌ర్ అసిస్టెంట్‌ శ్రీ‌మ‌తి శ్రీలక్ష్మితృతీయ బ‌హుమ‌తులు కైవ‌సం చేసుకున్నారు.

గాత్ర సంగీత పోటీల్లో ఎపిఆర్వో కుమారి పి.నీలిమ ప్ర‌థ‌మ‌, ఎఎవో శ్రీ‌మ‌తి పి.గాయ‌త్రి దేవి ద్వితీయ‌, శ్రీ‌మ‌తి అమృత‌వ‌ల్లి తృతీయ బ‌హుమ‌తులు సాధించారు.

క్విజ్ పోటీల్లో వైర్‌మెన్ శ్రీ‌మ‌తి ధ‌న‌లక్ష్మి జ‌ట్టుకు ప్ర‌థ‌మ‌, సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి శాంతి జట్టుకు ద్వితీయ, జూనియ‌ర్ అసిస్టెంట్ శ్రీ‌మ‌తి జాన‌కి జ‌ట్టుకు తృతీయ బ‌హుమతులు ల‌భించాయి.

ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాల విద్యార్థులు నిర్వ‌హించిన సంగీత‌, నృత్య కార్య‌క్ర‌మాలు విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. అదేవిధంగా టిటిడి మ‌హిళా ఉద్యోగులకు పౌరాణిక పాత్ర‌ల వేష‌ధార‌ణ పోటీలు నిర్వ‌హించి విజేత‌ల‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు.

టిటిడి సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, ఎస్‌పిడబ్ల్యు డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా|| వి.కృష్ణవేణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.