GRAND VANA BHOJANAM HELD AT SRIVARI METTU _ శ్రీవారి మెట్టు వద్ద ఘనంగా కార్తీక వనభోజనాలు
Tirupati, 09 December 2023: As part of the decade-old tradition, TTD organised Karthika Vana Bhojanam on Saturday at Paruveta Mandapam near Srivari Mettu.
Earlier the utsava idols of Sri Kalyana Venkateswara swami and His consorts were brought in parade to Paruveta Mandapam and offered Snapana Tirumanjanam and later vana bhojanam was conducted.
Archaka of Sri Kalyana Venkateswara swami temple Sri Narayanacharyulu said such an event was a favourite of Lord Vishnu and Karthika Masa Damodara Vana Bhojanam was launched in Srinivasa Mangapuram temple from 2013 onwards by TTD.
While large number of devotees participated, the artists of the Sri Annamacharya project performed sankeertans on the occasion.
DyEO Smt Varalakshmi, temple Special Officer and the TTD PRO Dr T Ravi, VGO Sri Bali Reddy, AEO Sri Gopinath, Superintendents Sri Chengalrayulu, Sri Vekataswami, temple inspector Sri Kiran Kumar Reddy and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారి మెట్టు వద్ద ఘనంగా కార్తీక వనభోజనాలు
తిరుపతి, 2023 డిసెంబర్ 09: పవిత్ర కార్తీకమాసం సందర్భంగా శనివారం శ్రీవారి మెట్టు వద్ద గల పార్వేట మండపంలో కార్తీక వనభోజన కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవరులను ఊరేగింపుగా పార్వేటిమండపానికి తీసుకొచ్చారు. స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం పార్వేట మండపంలో మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు కార్తీక వనభోజనోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ నారాయణాచార్యులు మాట్లాడుతూ, పవిత్రమైన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం శ్రీమహావిష్ణువుకి అత్యంత ఇష్టమని చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయంలో 2013 – 14వ సంవత్సరం నుండి టీటీడీ కార్తీక దామోదర వనభోజనం ప్రారంభించినట్లు తెలిపారు. అదే సంవత్సరం నుండి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా కార్తీక వనభోజనాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
కార్తీక వనభోజనం మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఆలయ ప్రత్యేక అధికారి మరియు టీటీడీ పి.ఆర్.ఓ డాక్టర్ టి.రవి, విజివో శ్రీ బాలి రెడ్డి, ఏఈఓ శ్రీ గోపీనాథ్, సూపరింటెండెంట్లు శ్రీ చంగల్ రాయులు, శ్రీ వెంకట స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.