GT JYESTABHISHEKAM _ జూలై 16 నుండి 18వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం

TIRUPATI, 15 JULY 2024: The annual Jyestabhishekam will be observed in Sri Govindaraja Swamy temple from July 16 to 18.
 
On the first day Kavacahadhivadam, the second day Kavacha Pratista and on the final day Kavacha Samarpana will be observed.
 
Everyday there will be Snapana Tirumanjanam in the morning and Veddhi Utsavam in the evening.
 
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
 

జూలై 16 నుండి 18వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం

తిరుపతి, 2024 జూలై 15: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జూలై 16 నుండి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం(అభిధేయక అభిషేకం) జరుగనుంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు ఏడాదికోసారి స్వర్ణకవచాలను తొలగించి శుద్ధి చేసి తిరిగి అమర్చుతారు.

ఇందులో భాగంగా జూలై 16న కవచాధివాసం, జూలై 17న కవచ ప్రతిష్ఠ, జూలై 18న కవచ సమర్పణ నిర్వహిస్తారు. ఈ ఉత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం చేపడతారు. ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం శతకలశ స్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహిస్తారు. ప్రతి ఏడాదీ ఆషాడ మాసం, జ్యేష్ఠా నక్షత్రం రోజున ఆలయంలో జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.