FSSAI TO CHECK THE QUALITY OF RAW MATERIALS PROCURED BY TTD _ తిరుమలలో ముడి సరుకుల నాణ్యత పరిశోధనకు ఎఫ్ఏస్ఏస్ఏఐ సహకారం

TTD TO SET UP FSSAI LAB SOON IN TIRUMALA

TIRUMALA, 15 JULY 2024: With an aim to enhance the quality of raw materials which are used in making the Prasadams and Annaprasadams, TTD EO Sri J Syamala Rao has decided to take the assistance of Food Safety and Security Authority of India(FSSAI) in the procurement.

A review meeting on the same subject along with the JEOs Smt Goutami, Sri Veerabrahmam with the authorities from FSSAI was held in the chamber of the EO in TTD Administrative Building in Tirupati on Monday evening.

During the meeting, the EO directed the JEO Tirupati to make necessary arrangements so that the FSSAI establishes a dedicated Lab in Tirumala to check the ingredients and raw materials that are being used in the preparation of Prasadams, Annaprasadams and also the purity of Jala Prasadam in a scientific manner. He also said, the FSSAI helps not only in checking the quality of the raw materials but also in procuring the best materials at a reduced price. 

The EO also said the rules and norms prescribed by FSSAI shall be followed while inviting tenders for procurement of raw materials. He also said, SoP shall be prepared for the procurement process also.

Sri Purnachandra Rao, Director of Food Safety of Andhra Pradesh, has also submitted certain recommendations on food and water safety measures.

Sri Ravindra Reddy, Food Safety and Fast-Tag Nodal Officer, Sri Balu Naik, Deputy Director of FSSAI, New Delhi, CE Sri Nageswara Rao, EE Procurement Sri Murali Krishna and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో ముడి సరుకుల నాణ్యత పరిశోధనకు ఎఫ్ఏస్ఏస్ఏఐ సహకారం

– తిరుమలలో ఎఫ్ఏస్ఏస్ఏఐ వారిచే ప్రత్యేక లాబొరేటరీ ఏర్పాటు.

•⁠ ⁠టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు

తిరుమల, 2024 జూలై 15: తిరుమలకు ప్రతిరోజు శ్రీవారి దర్శనార్థం విచ్చేసి వేలాదిమంది భక్తులకు టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాదాల ముడి సరుకులు ఎఫ్ఏస్ఏస్ఏఐ వారి సహకారంతో మరింత నాణ్యతతో కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈవో అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఎఫ్ఏస్ఏస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా) సహకారంతో తిరుమలలోఅత్యాధునిక పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో సోమవారం ఎఫ్ఏస్ఏస్ఏఐ, టీటీడీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమలకు విచ్చేసే భక్తులకు అందించే ఆహార పదార్థాలలో వినియోగించే ముడి సరుకులను వివిధ టెండర్ల ద్వారా టీటీడీ కొనుగోలు చేస్తోందన్నారు. వీటి నాణ్యతను పెంచేందుకు అత్యాధునికమైన పరిశోధన కేంద్రంను ఎఫ్ఏస్ఏస్ఏఐ సహకారంతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టీటీడీ కొనుగోలు చేస్తున్న వివిధ ముడి సరుకులు అత్యంత నాణ్యతతో ఉండడానికి గాను, వాటిని పరీక్షించేందుకు తిరుమలలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ లేబరటరీ (ఆహార ప్రయోగశాలలో )మరింత పారదర్శకంగా నాణ్యతను పరిశీలించేందుకు వీలవుతుందన్నారు.

తిరుమలలో భక్తులకు అందిస్తున్న జల ప్రసాదం యొక్క నాణ్యత, వంటశాలల లను ఎప్పటికప్పుడు పరీక్షించడం జరుగుతోందన్నారు. ముడి సరుకుల కొనుగోలుకు సంబంధించి ఎస్ఓపిని తయారు చేయాలని జేఈవో
ను ఆయన కోరారు.

భక్తులకు అందించే అన్న ప్రసాద భవనంలో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. తిరుమలలో ప్రత్యేకంగా ఎఫ్ఏస్ఏస్ఏఐ ల్యాబ్ ను ఏర్పాటు ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని ఇవ్వాలని జేఈవోను ఆదేశించారు.

ఈ సందర్భంగా న్యూఢిల్లీకి చెందిన ఎఫ్ఏస్ఏస్ఏఐ సీఈవో శ్రీ కమలవర్ధన్ రావు ఆదేశాల మేరకు, ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ డాక్టర్ పూర్ణచంద్రరావు ఈ సందర్భంగా తిరుమలలో భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాలు, జల ప్రసాదం తదితర అంశాలపై జాగ్రత్తలను, అదేవిధంగా నాణ్యత పెంచడానికి అవసరమైన సూచనలను ఈవోకు వివరించారు.

ఈ సమావేశంలో జేఈవో శ్రీమతి గౌతమి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ ఫాస్ట్ ట్రాక్ నోడల్ అధికారి శ్రీ రవీంద్రారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ ఎఫ్ఏస్ఏస్ఏఐ అధికారి శ్రీ బాలు నాయక్, టీటీడీ సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.