GUIDELINES FOR LOCALS DARSHAN _ స్థానికుల కోటా ద‌ర్శ‌నాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు

TIRUMALA, 01 DECEMBER 2024: As resolved by the TTD Trust Board, the darshan for locals will be provided on every first Tuesday which will commence on December 03.
 
The darshan tokens will be issued at Mahati Auditorium in Tirupati and Community Hall of Balaji Nagar in Tirumala from 5am onwards on December 02.
 
TTD has formulated certain guidelines which is mandatory for the local devout darshan.
 
To issue 2,500 (Two thousand five hundred) tokens at Mahati Auditorium, Tirupati and 500 (Five hundred) tokens at Community Hall, Balaji Nagar, Tirumala on 02/12/2024 (Monday) between 3:00 AM and 5:00 AM on first cum first serve basis free of cost
 
The local residents shall have to bring their original Aadhar card for getting the darshan token.
 
Pilgrims with tokens shall enter the Foot Path (Divya Darshan) entrance (VQC) for Srivari darshan along with their original Aadhar Card.
 
Pilgrims will be provided One Small laddu free of cost on par with SSD token pilgrims
 
Next Darshan eligibility is only after 90 days for those who had completed darshan under this category
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స్థానికుల కోటా ద‌ర్శ‌నాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు

తిరుమల, 2024 డిసెంబరు 01: తిరుప‌తి స్థానికుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు ప్ర‌తి నెలా మొదటి మంగళవారం ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. డిసెంబ‌రు 3వ తేది స్థానికుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్నారు.

డిసెంబరు 2వ తేది తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లను ఉచితంగా జారీ చేస్తారు.

స్థానికుల ద‌ర్శ‌నాల‌కు టీటీడీ రూపొందించిన మార్గ‌ద‌ర్శ‌కాలుః

•⁠ ⁠తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమ‌ల‌లోని బాలాజీ న‌గ‌ర్ క‌మ్యూనిటీ హాల్ లో 500 టోకెన్లు (ఉదయం 3 నుండి ఉదయం 5 గంటల మధ్య) జారీ చేయనున్నారు.

•⁠ ⁠ముందుగా వ‌చ్చిన‌వారికి తొలి ప్రాధాన్య‌త‌తో టోకెన్లు కేటాయిస్తారు.

•⁠ ⁠దర్శన టోకెన్ పొందడానికి స్థానికులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాలి.

•⁠ ⁠టోకెన్లు పొందిన భ‌క్తులు ద‌ర్శ‌న స‌మ‌యంలో ఒరిజిన‌ల్ ఆధార్ కార్డును తీసుకురావాల్సి ఉంటుంది.

•⁠ ⁠వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని ఫుట్ పాత్ హాల్‌(దివ్య ద‌ర్శ‌నం) క్యూలైన్ లో భ‌క్తుల‌ను ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తిస్తారు.

•⁠ ⁠ఇతర దర్శనాల్లో ఇచ్చేవిధంగా ద‌ర్శ‌నానంత‌రం ఒక లడ్డూ ఉచితంగా అందించబడుతుంది.

•⁠ ⁠స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజుల వ‌ర‌కు ద‌ర్శ‌నం చేసుకునేందుకు అవకాశం ఉండదు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.