GURUPUJOTSAVAM IN TELUGU STATES_ జూలై 9న తెలుగు రాష్ట్రాల్లో గురుపూజ మహోత్సవం
Tirupati, 8 July 2017: Gurupujotsavam will be observed in twin Telugu states on Sunday on the occasion of Gurupurnima on July 9.
The Hindu Dharma Prachara Parishad wing of TTD will organise this programme in the respective districts and felicitate the Gurus of Bhajana mandalis, Burrakatha, Harikatha and other Kalarupas.
HDPP Secretary Sri Ramakrishna a Reddy is supervising the arrangements.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జూలై 9న తెలుగు రాష్ట్రాల్లో గురుపూజ మహోత్సవం
తిరుపతి, 2017 జూలై 08: గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 9వ తేదీన టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో గురుపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
భజన మండళ్ల గురువులను, హరికథ, బుర్రకథ, ఒగ్గుకథ తదితర సంప్రదాయ కళారూపాలకు చెందిన గురువులను ఈ సందర్భంగా సన్మానిస్తారు. ఒక్కో జిల్లా నుంచి ఐదుగురు గురువులను ఎంపిక చేసి శాలువ, శ్రీవారి చిత్రపటంతో సత్కరిస్తారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీఎ.రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.