TIRUMALA PONTIFFS TO COMMENCE CHATURMASA DEEKSHA ON JULY 9_ జూలై 9న తిరుమల పెద్దజీయంగార్‌ చాతుర్మాస దీక్ష

Tirumala, 8 July 2017: On the auspicious day of Guru Pournima which falls on Sunday, the pontiffs of Tirumala, HH Sri Periyakovil Kelviyappan Shadagopa Ramanuja Pedda Jiyangar Swamy and Junior pontiff, HH Sri Narayana Ramanuja Chinna Jiyangar swamy will commence Chaturmasa Deeksha in Tirumala in a ceremonial manner.

They will receive the traditional temple honours in Tirumala by 10am as a part of this religious ceremony.
The significance of this fete is that Bharat is the land of Karmabhoomi. Sri Vaishnava Acharya Sri Ramanujacharya has taught many pujas and vratas for the wellbeing of humanity. Chaturmasa Deeksha is one such important religious fetes followed by the saintly persons during the four months- Shravana, Bhadrapada, Aaswayuja and karteeka. The seers perform sacred deeds like Snana, Japa, Tapa, Homa etc.with utmost devotion for the welfare of the humanity.

POURNAMI GARUDA SEVA

In the evening of July 9 Lord Malayappa Swamy take celestial ride on Garuda Vahanam in the four mada streets of Tirumala between 7pm and 9pm on the occasion pournami.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూలై 9న తిరుమల పెద్దజీయంగార్‌ చాతుర్మాస దీక్ష

తిరుమల, 2017 జూలై 08: జూలై 9వ తేదీన తిరుమలలో పెద్దజీయంగారి నేత త్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. హైందవ సనాతన వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక పవిత్ర మాసాలలో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత, దానాదులను లోక కల్యాణార్థం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ నేపథ్యంలో రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా వ్యాస పూర్ణిమ మరునాడు నుండి ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారు. ఈ సందర్భంగా తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన ఉన్న జీయంగారి మఠం నుండి చిన్నజీయంగారు మరియు శిష్యబ ందంతో కూడి ముందుగా వరాహస్వామి ఆలయాన్ని, స్వామి పుష్కరిణిని సందర్శించి అనంతరం శ్రీవారి ఆలయానికి విచ్చేస్తారు. శ్రీవారి ఆలయ మహాద్వారం చెంత టిటిడి కార్యనిర్వహణాధికారి ఇతర ఆలయ అధికారులతో కలిసి మర్యాదపూర్వకంగా వారిని ఆహ్వానిస్తారు. శ్రీ జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత రంగనాయకుల మండపంలో తిరుమల పెద్దజీయంగారికి మేల్‌చాట్‌ వస్త్రాన్ని, చిన్నజీయంగారికి నూలుచాటు వస్త్రాన్ని బహూకరిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికార ప్రముఖులు పాల్గొంటారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.