HAMSA VAHANAM GLIDES ALONG MADA STREETS _ హంస వాహనంపై శ్రీ కోదండరాముడి అభయం

TIRUPATI, 21 MARCH 2023: On the second day evening on Tuesday, Sri Ramachandra Swamy as Saraswathi Devi blessed devotees on Hamasa Vahanam as part of ongoing annual brahmotsavams in Sri Kodanda Ramalayam in Tirupati.

 

Both the Senior and Junior Pontiffs of Tirumala, DyEO Smt Nagaratna, VGO Sri Manohar and others were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హంస వాహనంపై శ్రీ కోదండరాముడి అభయం

తిరుపతి, 2023 మార్చి 21: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం రాత్రి హంస వాహనంపై శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 నుండి వాహనసేవ జరిగింది. గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, విజివో శ్రీ మనోహర్, ఏఈవో శ్రీ మోహన్, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, కంకణభట్టర్ శ్రీ ఆనందకుమార దీక్షితులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.