HANUMAN JAYANTHI FETE FROM MAY 25-29 _ మే 25 నుండి 29వ తేదీ వ‌ర‌కు హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్సవాలు

TIRUMALA, 07 MAY 2022: TTD is contemplating to organised Hanuman Jayanti in a big way from May 25th to 29th at Tirumala.

In this connection, a review meeting with all the department heads in Tirumala by Additional EO Sri AV Dharma Reddy took place at Annamaiah Bhavan on Saturday.

The Additional EO directed officials concerned that the five day festivities will be observed at Anjanadri, Japali, Nada Neerajanam and Dharmagiri Veda Vignana Peetham.

He said on May 29 Akhanda Sampoorna Sundarakanda Parayanam will be conducted at Dharmagiri.

He said special programs and discourses shall be organized on Anjanadri Vaibhavam, Itihasa Hanumadvijayam, Yoganjaneyam, Veeranjaneyam, Bhaktanjaneyam and will be telecasted live on SVBC for the sake of global devotees.

He directed the concerned that scholars Sri Rani Sadasivamurthy, Dr Vibhishana Sharma, Sri Pavana Kumara Sharma to be involved in Nada Neerajanam programs.

CEO SVBC Sri Suresh Kumar, SE 2 Sri Jagadeeshwar Reddy, DyEO Sri Ramesh Babu, DE Sri Ravishankar Reddy, VGO Sri Bali Reddy, scholar Sri Viswanatha Sharma and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మే 25 నుండి 29వ తేదీ వ‌ర‌కు హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్సవాలు

విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించిన టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2022 మే 07: తిరుమ‌ల‌లో ఈ నెల 25 నుండి 29వ తేదీ వ‌ర‌కు హ‌నుమ‌జ్జ‌యంతిని వైభ‌వంగా నిర్వ‌హించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం ఉద‌యం హ‌నుమ‌జ్జ‌యంతి ఏర్పాట్ల‌పై అధికారుల‌తో స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ హ‌నుమంతుని జ‌న్మ‌స్థ‌ల‌మైన అంజ‌నాద్రిలోని ఆకాశ‌గంగ వ‌ద్ద‌, జాపాలీ తీర్థం, నాద‌నీరాజ‌నం వేదిక‌, ఎస్వీ వేద పాఠ‌శాల‌లో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హణ‌కు ఏర్పాట్లు చేయాల‌న్నారు. మే 29న ధ‌ర్మ‌గిరి వేద‌పాఠ‌శాల‌లో సంపూర్ణ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం నిర్వ‌హించేందుకు ఆయా విభాగాల అధికారులు ముంద‌స్తు ఏర్పాట్లు చేయాల‌న్నారు.

ఆయా రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు ఈ కార్య‌క్ర‌మాల‌ను వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీ నాలుగు ఛాన‌ళ్ల ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయాల‌న్నారు. ఈ ఉత్స‌వానికి సంబంధించి ఆక‌ట్టుకునేలా ప్రోమో రూపొందించాలని కోరారు. నాదనీరాజ‌నం వేదిక‌పై నిర్వ‌హించే ప్ర‌వ‌చ‌నాల‌కు సంబంధించి ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌, శ్రీ ప‌వ‌న‌కుమార శ‌ర్మ త‌దిత‌ర పండితుల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌న్నారు. అంజ‌నాద్రి వైభ‌వం, ఇతిహాస హ‌నుమ‌ద్విజ‌యం, యోగాంజ‌నేయం, వీరాంజ‌నేయం, భ‌క్తాంజ‌నేయం ప‌లు అంశాల‌పై ప్ర‌వ‌చ‌నాలు ఉంటాయ‌న్నారు. ఏర్పాట్ల‌కు సంబంధించి ఇంజినీరింగ్‌, అన్న‌దానం, ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, ఎస్వీ వేద పాఠ‌శాల‌, భ‌ద్ర‌తా విభాగం, పిఆర్వో, ఎస్వీబీసీ విభాగాలు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌న్నారు.

ఈ స‌మావేశంలో ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్‌కుమార్‌, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్ బాబు, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, డిఇ శ్రీ ర‌విశంక‌ర్‌రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, పండితులు ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌, శ్రీ కుప్పా విశ్వ‌నాథ‌శర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.