HANUMAN JAYANTI ON MAY 22 _ మే 22న తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు
Tirumala, 20 May 2025: In connection with Hanuman Jayanti on May 22 TTD will present silk vastrams to Japali Hanuman in Tirumala.
It is a traditional practice to offer Pattu Vastrams to Sri Japali Hanuman every year on behalf of TTD during the auspicious occasion of Hanuman Jayanti.
Besides special pujas will also be observed to Sri Bedi Anjaneya Swamy and 7th Mile Prasanna Anjaneya Swamy in Down Ghat road on that day.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే 22న తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు
తిరుమల, 2025 మే 20: ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళదశమినాడు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే హనుమజ్జయంతి వేడుకలు ఈ ఏడాది మే 22వ తారీఖున టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది.
శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, కాలినడకబాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి వారికి హనుమజ్జయంతినాడు ప్రత్యేక పూజలు జరుగనుంది.
తిరుమలలోని జాపాలి తీర్థంలో కూడా హనుమజ్జయంతి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడుతుంది.
ఈ సందర్భంగా సాంప్రదాయానుసారం టీటీడీ తరపున శ్రీ జపాలి హనుమాన్ కు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
కాగా మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి అదే రోజు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు టీటీడీ భక్తులు, స్థానికుల సౌకర్యార్థం ఉచిత రవాణా సౌకర్యాన్ని తిరుమల నుండి ఏడో మైలుకు, తిరిగి తిరుమల చేరడానికి కూడా కల్పిస్తున్నది.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది