HASSLE FREE SECURITY PLAN REVIEWED _ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు - టిటిడి అదనపు ఈవో
Tirumala, 28 September 2024: TTD Additional EO Sri Ch Venkaiah Chowdhary along with Tirupati SP Sri Subbarayudu and CVSO Sri Sridhar discussed in elaborate about the security arrangements.
The review meeting on the security arrangements for the ensuing annual Brahmotsavams was held in Annamaiah Bhavan on Saturday evening attended by both TTD sleuths and the district cops.
The additional EO asked the top bosses from TTD and Police to ensure that the devotees experience a hassle-free darshan and Vahana Sevas.
He said, keeping in view the past experience, necessary precautions to be taken not to repeat the same.
The Additional EO also instructed the concern to ensure that the food trolley reach the galleries on the day of Garuda Seva day. A security shall also be provided to avoid any sort of inconvenience.
He said TTD security and district police should coordinate with each other on regulating traffic, parking of vehicles and other aspects.
He also instructed to open an exclusive WhatsApp group with important officers to closely monitor the arrangements and activities during annual Brahmotsavams.
JEO Sri Veerabrahmam, CE Sri Satyanarayana, Temple DyEO Sri Lokanatham, GM Transport Sri Sesha Reddy and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు - టిటిడి అదనపు ఈవో
తిరుమల, 2024 సెప్టెంబరు 28: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.
తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, సివిఎస్‌వో శ్రీ శ్రీధర్‌తో కలిసి అదనపు ఈవో భద్రతా ఏర్పాట్లపై విస్తృతంగా సమీక్షించారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం, వాహనసేవలు జరిగేలా చూడాలని టీటీడీ, పోలీసు ఉన్నతాధికారులను అదనపు ఈవో కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
గరుడసేవ రోజు ఇటువంటి ఇబ్బంది లేకుండా గ్యాలరీలకు అన్నప్రసాదాలు చేరేలా చూడాలని అదనపు ఈఓకు సూచించారు.
ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ తదితర అంశాల్లో టీటీడీ భద్రత, జిల్లా పోలీసులు పరస్పరం సమన్వయం చేసుకోవాలన్నారు.
వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏర్పాట్లను మరియు కార్యక్రమాలను నిశితంగా పర్యవేక్షించడానికి ముఖ్యమైన అధికారులతో ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు ఏర్పాటు చెయ్యాలని ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో జె ఈ ఓ శ్రీ వీరబ్రహ్మం, సిఈ శ్రీ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, రవాణా విభాగం జిఎం శ్రీ శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది