HDPP ACTIVITIES SHOULD REACH EVERYONE -JEO_ సనాతన ధర్మ సంస్కృతి, మూలాలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలి : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌  

Tirupati, 5 Aug. 19: The Hindu Dharma Prachara activities taken up by TTD should reach everyone in the society, said TTD JEO Sri P Basant Kumar.

Speaking during the meeting with Dharma Prachara Mandali members and HDPP Program Assistants held at SVETA building in Tirupati on Monday evening, the JEO said, the dharmic programmes mulled by TTD should reach even the grass-root level. All the volunteers, DPM members should be involved in dharmic activities of TTD, he directed the concerned.

Later he also discussed on the cultural troupes deployed for brahmotsavams, Dharma Ratham, Archaka training etc. carried under the aegis of TTD.

HDPP Secretary Sri Ramana Prasad and others were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సనాతన ధర్మ సంస్కృతి, మూలాలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలి : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌  

తిరుపతి, 2019  ఆగస్టు 5: సనాతన ధర్మ సంస్కృతి, మూలాలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌ కోరారు. తిరుపతిలోని శ్వేత భవనంలో సోమవారం సాయంత్రం టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ప్రోగ్రాం అసిస్టెంట్లు, జిల్లా ధర్మప్రచార మండళ్ల సభ్యులతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా  జెఈవో  మాట్లాడుతూ  హిందూ ధ‌ర్మాన్ని క్షేత్ర‌స్థాయికి తీసుకెళ్ల‌డానికి ప్ర‌తి ఒక్క‌రు సైనికుల్లా ప‌నిచేయాల‌న్నారు. సనాతన ధ‌ర్మ  ప్ర‌చారమనేది స‌మిష్ఠి భాధ్య‌త అని, ధ‌ర్మాన్ని కాపాడితే అది మ‌న‌ల్ని కాపాడుతుంద‌న్నారు. హిందూధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాలను జిల్లా ఉన్నాతాధికారుల‌ దృష్ఠికి తీసుకెళ్లి, అందులో వారిని భాగ‌స్వాముల‌ను చేయ‌డం వ‌ల‌న కార్యక్రమాలు మరింత విజ‌య‌వంతం అవుతాయని సూచించారు. డిపిపి రోజువారి కార్య‌క్ర‌మాల‌ను టిటిడి ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు తెలియ‌జేయాల‌న్నారు. హిందూధర్మ ఆచార సాంప్ర‌దాయాలు, పురాణాలు, నైతిక విలువ‌లు యువతకు తెలియజేయాల‌న్నారు. జిల్లా స్థాయిలో నిర్వ‌హించే డిపిపి కార్య‌క్ర‌మాల‌ను అడిగి తెలుసుకున్నారు.   
         
అనంత‌రం రెండు తెలుగు రాష్ట్రాలలో మనగుడి కార్యక్రమాన్ని ఆయా ప్రాంతాల్లో జిల్లా ధర్మప్రచార మండలి సభ్యులు, దాససాహిత్య ప్రాజెక్టు, భజన మండళ్ల సభ్యులు, శ్రీవారి సేవకులు, విద్యార్థులు కలిసి మనగుడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
         
అనంత‌రం తిరుమ‌ల శ్రీ‌వారిబ్ర‌హ్మోత్సాల సంద‌ర్భంగా నిర్వ‌హించే సాంస్కృతిక కార్య‌క్ర‌మాలకు కళాబృందాలు , శ్రీ వేంక‌టేశ్వ‌ర ధ‌ర్మ‌ర‌థం, అర్చ‌క శిక్ష‌ణ‌, డిపిపి వెబ్‌సైట్‌, స‌ప్తహం కార్య‌క్ర‌మంలో భాగంగా రామాయ‌ణం, మ‌హ‌భార‌తం, భాగ‌వ‌తం త‌దిత‌ర అంశాల‌పై అధికారుల‌తో, జిల్లా ధార్మిక మండ‌ళ్ల స‌భ్యుల‌తో చ‌ర్చించి ప‌లు సూచ‌న‌లు చేశారు. 

ఈ కార్యక్రమంలో డిపిపి కార్యదర్శి డా. రమణ ప్రసాద్,  ఏఈవో శ్రీ ఎన్.  నాగేశ్వరరావు, సూపరింటెండెంట్‌ శ్రీ ఎం. గురునాథం, ఇతర సిబ్బంది  పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.