PANCHAMI GARUDA SEVA OBSERVED_ తిరుమలలో ఘనంగా గరుడ పంచమి

Tirumala, 5 Aug. 19: In connection with the auspicious occasion of Garuda Panchami festival, the Garuda Vahana Seva was observed in Tirumala.

Sri Malayappa Swamy in all His divine splendour blessed the devotees who gathered in four mada streets.

The procession lasted between 7pm and 9pm.

Tirumala Spl Officer Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, VGO Sri Manohar, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Lokanadham and others took part.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో ఘనంగా గరుడ పంచమి

తిరుమల, 2019 ఆగ‌స్టు 05: గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమ‌వారం తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ గరుడ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.

శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ”గరుడ పంచమి” పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా, బలశాలిగా ఉండేందుకు చేస్తారు.

గరుడ వాహనసేవలో టిటిడి ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్డి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి చీఫ్ ఇంజినీర్ శ్రీ రామ‌చంద్రారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ శ్రీ లోక‌నాథం ఇత‌ర‌ అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.